NTV Telugu Site icon

Chiranjeevi: అలా చేయలేని రోజు రిటైర్ అవుతా.. ఇలాంటి ప్రశ్నని మీతో వేయించుకోను

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్..టాలీవుడ్ శిఖరం. ఆయన చేసిన పాత్రలు, స్టంట్లు, ప్రయోగాలు ఏ హీరో చేసి ఉండరు. ఇప్పటికి, ఈ ఏజ్ లో కూడా పాత్రకు తగ్గట్టు మౌల్డ్ అవ్వడంలో చిరును మించిన వారు లేరు. ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య చిత్రంలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన శృతిహాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలక అపాత్రలో నటిస్తోంది. ఇక గతరాత్రి వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెల్సిందే. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ వేసిన ప్రశ్నకు చిరు కొద్దిగా ఫైర్ అయ్యాడు.

కెరీర్ ప్రారంభంలో గుర్తింపు కోసం కష్టతరమైన సన్నివేశాలు చేశారు. ఇప్పుడు మెగాస్టార్ గా ఉన్నా కూడా ఈ మూవీ కోసం -8 డిగ్రీల్లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఉందా? వర్షంలో తడస్తూ సీన్స్ చేయాలా?.. అని అడుగుగా అందుకు చిరు మాట్లాడుతూ.. ” చాలా అవసరం ఉంది.. ఇలా చేయని రోజున రిటైర్మెంట్ ప్రకటించటం మంచిది. ఈ మాట ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ చెప్తాను.. పరిస్థితులు ఎలా ఉన్నా, మనం కమిట్ అయినప్పుడు.. ఆ పాత్రకి న్యాయం చేయటనికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని కనపడకుండా.. వాటికి తలొగ్గి చేయాల్సిందే. అలా చేసినప్పుడే ఈ రంగంలో ఉండేందుకు ఎవరికైనా అర్హత ఉంటుంది. లేదంటే ఇంటికెళ్లిపోవచ్చు. ఒక యాక్టర్ గా నేను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నని మీతో వేయించుకోను. వేషాలపై ఆకలితో ఉండాలి. ఒకవేళ ఆ ఆకలి చచ్చిపోయినప్పుడు ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోవచ్చు. స్టార్ డమ్ రావాలంటే ఇలా రిస్క్ చేయటం తప్పదు. మనం ఒక పని చేయాలని నిర్ణయించుకున్నా ఆ పనిలో వచ్చే ఇబ్బందులు అన్ని ఎదురుకోవాలి..లేదా రిటైర్మెంట్ తీసుకోవాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చిరు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.