మెగాస్టార్ చిరంజీవి గురించి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ ” మెగాస్టార్ చిరంజీవి గారు 150 పైగా ఫిలిమ్స్ చేశారు, కేంద్ర మంత్రిగా పని చేశారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో ఎక్కారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్.. అంటే ఒక మనిషి ఎన్ని సాధించాలో అంత పీక్ సాధించిన మనిషి అంత గ్రౌండెడ్‌గా ఎలా ఉంటారు? అంత హంబుల్‌గా ఎలా ఉంటారు? అంత హ్యూమానిటీగా ఎలా ఉంటారు? అంత పాజిటివ్‌గా ఎలా ఉంటారు? ఐ కాంట్ ఇమాజిన్ సార్. మీతో గడిపిన ఈ సిక్స్ మంత్స్ జర్నీ నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేను.
యా యా, అండ్ ఇంకొక విషయం చెప్పాలి. నా ప్రయాణం, ఈ సినిమా ఆరు నెలల ప్రయాణం ఎలా జరిగిందంటే.. మార్చి, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాం. ప్రతిరోజు సెట్‌లో ఒక ‘ఖైదీ’తో గడిపాను. ప్రతిరోజు సెట్‌లో ఒక ‘యముడికి మొగుడు’తో గడిపాను, ఒక ‘దొంగ మొగుడు’తో టైం స్పెండ్ చేశాను. ఒక ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’తో స్పెండ్ చేశాను, ‘రౌడీ అల్లుడు’తో స్పెండ్ చేశాను, ‘గ్యాంగ్ లీడర్’తో స్పెండ్ చేశాను, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’తో స్పెండ్ చేశాను. అసలు వాట్ నాట్.. ‘హిట్లర్’, ‘మాస్టర్’, ‘బావగారూ బాగున్నారా?’, ‘చూడాలని ఉంది’.. అట్మోస్ట్ చిరంజీవి గారి 150 ఫిలిమ్స్ కెరీర్‌లో ఆల్మోస్ట్ నేను చూస్తూ పెరిగిన అన్ని సినిమా పాత్రలతో ఆయనతో నేను ప్రయాణం చేశాను.
ఎందుకంటే ప్రతిరోజు ఆయన పక్కన కూర్చొని చిన్న పిల్లల్లాగా.. సార్ ఆ సినిమా ఎలా చేశారు సార్? ఈ సినిమా ఎలా చేశారు సార్? ఈ కామెడీ అంటే.. ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్. నాకు నా లైఫ్ లో నేను మర్చిపోలేను ఈ జర్నీ. సో, ఆయన అనుభవాలన్నీ కలిపి ఒక ఆవకాయ అన్నం ముద్దలా మా అందరికీ వడ్డించారు. థాంక్యూ చిరంజీవి సార్, థాంక్యూ సో మచ్.
అండ్ ఈ సినిమా ఆరు నెలల ప్రయాణం తర్వాత లాస్ట్ వర్కింగ్ డే రోజు.. చిరంజీవి గారు, నేను.. మా ఇద్దరం ఒకరినొకరిని చూస్తూ ఆప్యాయంగా, అఫెక్షన్‌గా నన్ను ఆయన హగ్ చేసుకున్న సందర్భం నా లైఫ్ లో నేను మర్చిపోలేను. అండ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఒక హీరోగా ఆయన నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక డైరెక్టర్ గా అలాంటి ఒక లెజెండరీ హీరోతో నేను పని చేసినందుకు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. దట్ షోస్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి.. ఎక్కడికి వెళ్లబోతుంది అనేది, అంత పాజిటివిటీ ఉంది. థాంక్యూ చిరంజీవి సార్, థాంక్యూ సో మచ్.
ఈ సినిమా కథ చెప్పిన తర్వాత, ఈ టైటిల్ చెప్పాక.. ఆయన ఒరిజినల్ నేమ్‌తో ఒక క్యారెక్టర్ పెట్టి ఈ సినిమాలో ఎంత అల్లరి చేయాలో, ఎంత గోల చేయాలో అంత గోల చేసేసాను. అండ్ చాలా మంది ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిలిమే అనుకుంటున్నారు. ఈ సినిమాలో అంతకు మించిన ఎమోషనల్ డ్రామా కూడా ఉంది, అది మీరు సినిమాలో చూస్తే మీరు కనెక్ట్ అవుతారు. సో ఫుల్ మీల్స్ కామెడీ, ఎంటర్టైన్మెంట్.. అది సెంటిమెంట్, డాన్స్, సాంగ్స్. ఇక విక్టరీ వెంకటేష్ గారు వచ్చాక ఒక అద్భుతమైన అల్లరి అండ్ కంప్లీట్ ప్యాకేజ్ బాగా కుదిరింది.”
