Site icon NTV Telugu

ఉత్తేజ్ భార్య సంతాప సభ.. చిరంజీవికి కన్నీళ్లు ఆగలేదు

టాలీవుడ్ న‌టుడు ఉత్తేజ్ భార్య ప‌ద్మ ఇటీవలే క‌న్నుమూశారు. కొన్నిరోజులుగా క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న ఆమె మ‌ర‌ణించారు. ఇవాళ ఉత్తేజ్ భార్య ప‌ద్మ సంస్మ‌ర‌ణ స‌భ హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్‌‌సీసీ క్లబ్‌లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఉత్తేజ్ కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు హాజరయ్యి ఉత్తేజ్‌ను ఓదార్చారు. ఉత్తేజ్ భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

చిరంజీవి, నాగబాబు, శ్రీకాంత్, మురళి మోహన్, రాజశేఖర్, హేమ, సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు సహా ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవిని చూడగానే ఉత్తేజ్‌ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. ఆయన్ను పట్టుకుని భోరున విలపించాడు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎలాంటి బంధం అయినా విడిపోయినపుడు.. దూరం అయినపుడు కాలంతో పాటు మరిచిపోగలం కానీ భార్యాభర్తల బంధం మాత్రం అలా కాదన్నారు చిరంజీవి. ఒకరిపై ఒకరు ఆధారపడి భార్యాభర్తలు ఉంటారని.. అందులో ఏ ఒక్కరు దూరమైనా కూడా జీవితాంతం ఆ లోటు తప్పదంటూ ఉత్తేజ్ భార్య పద్మ గారి మరణాన్ని ఉద్దేశించి చిరంజీవి చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని’ చిరు కోరారు.

https://youtu.be/HkkGsKRsH1k
https://youtu.be/oKnGJJyTPDo
Exit mobile version