Site icon NTV Telugu

Chiranjeevi : ఆ తెలుగు వైద్యుడి కోసం మెగాస్టార్ ఎమోషనల్

Chiranjeevi

ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి రప్పించడానికి భారత ప్రభుత్వం కూడా చేయాల్సిందంతా చేస్తోంది. ఆపరేషన్ గంగ అంటూ స్పెషల్ విమానాలు వంటివి ఏర్పాటు చేసి ఏదో ఒక రకంగా అందరినీ ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఓ భారతీయ డాక్టర్ మాత్రం తన పెంపుడు జంతువుల కోసం ఉక్రెయిన్ లోనే ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన పెంపుడు జంతువులను ఇక్కడ కూడా బహిరంగంగా పెంచుకోవడానికి అనుమతులు లేవు. ఉక్రెయిన్ లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరి కుమార్ పాటిల్ ఒక జాగ్వర్, ఒక పాంథర్ లను పెంచుకుంటున్నారు.

Read Also : HBD Ritu Varma : న‌వ‌త‌రం నాయిక రితూ వ‌ర్మ‌!

ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇష్టంగా పెంచుకున్న ఆ మూగ జీవాలను అక్కడే వదిలేయలేక తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ బంకర్లో వాటితో కలిసి తలదాచుకుంటున్నారు.చిరంజీవి ‘లంకేశ్వరుడు’ సినిమా చూసి ప్రేరణ పొంది వాటిని పెంచుకుంటున్నట్టు గిరి కుమార్ చెబుతన్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా చూసి తెలుసుకున్న చిరంజీవి గిరి కుమార్ క్షేమాన్ని కోరుతూ ఒక ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

“ప్రియమైన గిరి కుమార్… జాగ్వర్స్, పాంథర్స్ పట్ల మీ ప్రేమ నా నుండి ప్రేరణ పొందారని తెలిసి సంతోషిస్తున్నాను. ఈ దురదృష్టకర యుద్ధ సమయంలో ఈ జీవుల పట్ల మీ ప్రేమ,కరుణ నిజంగా ప్రశంసనీయం. ఈ సమయంలో మీరు బాగుండాలని నేను ప్రార్థిస్తున్నాను” అంటూ సుదీర్ఘ నోట్ ను పంచుకున్నారు.

Exit mobile version