‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసి, వింటేజ్ మెగాస్టార్‌ను థియేటర్లలో చూపించిన సక్సెస్‌ఫుల్ కాంబో మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా, అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ ఒక సాలిడ్ అప్‌డేట్‌ను బయటకు వదిలారు. బాబీ టేకింగ్, మెగాస్టార్ గ్రేస్.. ఈ రెండింటికీ విజువల్ గా అదిరిపోయే అవుట్‌పుట్ ఇచ్చేందుకు టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు మేకర్స్. రజనీకాంత్ ‘జైలర్’, బాలకృష్ణ ‘డాకూ మహారాజ్’, రాబోయే ‘జైలర్ 2’ వంటి పాన్-ఇండియా సినిమాలతో తన కెమెరా పనితనానికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఆయన ఇప్పటికే నిరూపించుకున్నారు. విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌లోకి ఆయనకు స్వాగతం పలుకుతూ చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.
గతంలో డైరెక్టర్ బాబీతో పని చేసిన అనుభవం ఉన్న విజయ్.. ఈసారి మెగాస్టార్ కోసం తన బెస్ట్ విజువల్స్ అందించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన చిరంజీవి జిమ్ వర్కౌట్ వీడియోలు, లుక్ టెస్ట్ ఇమేజెస్ చూస్తుంటే ఈ సినిమాలో బాస్ మునుపెన్నడూ చూడని స్టైలిష్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. మాస్ నాడి తెలిసిన దర్శకుడు బాబీ.. ఈసారి థియేటర్లలో సీట్లు వదిలి అభిమానులు డ్యాన్సులు చేసేలా హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, గూస్‌బంప్స్ తెప్పించే మాస్ ఎలివేషన్స్‌తో స్క్రిప్ట్ సిద్ధం చేశారట. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ప్రెజెంట్ చేసేలా ఈ మూవీ తెరకెక్కబోతోంది.
