దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహిరి ఇక లేరన్న వార్త ఈ రోజు ఉదయం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 70వ దశకంలోనే బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేసి ఉర్రూతలూగించిన ఆయన ఇక లేరన్న వార్త ఇండస్ట్రీని కలచివేసింది. బప్పీ లహిరి ఈరోజు ఉదయం అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Read Also : Bappi Lahari : ప్రముఖ సంగీత దర్శకుడు ఇకలేరు… ఇండస్ట్రీలో విషాదం
“దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహిరి మరణం తీవ్ర వేదనను కలిగించింది… నాకు బప్పి డాతో గొప్ప అనుబంధం ఉంది… అతను నా కోసం అనేక చార్ట్‌బస్టర్‌లను అందించాడు. అవి నా సినిమాలు హిట్ కావడానికి ఎంతగానో దోహదం చేశాయి. బప్పి యూనిక్ స్టైల్, జీవితం పట్ల గొప్ప ఉత్సాహం ఆయన మ్యూజిక్ లో ప్రతిబింబిస్తుంది… ఆయన సన్నిహితులకు, ప్రియమైన వారందరికీ నా హృదయపూర్వక సానుభూతి” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి హిట్ మూవీస్ స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, బిగ్ బాస్ వంట సూపర్ హిట్ సినిమాలకు బప్పి లహరి సంగీతం అందించారు. ఇక బప్పి మరణవార్త తెలిసిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
