Chiranjeevi: గత కొన్నిరోజులుగా దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న విషయం అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి. దాదాపు రూ. 1000 కోట్లతో ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. జూలై లో పెళ్లి జరగనుంది. పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో అనేది ఊహకు అందని విషయం. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా స్టార్లు, క్రికెటర్స్, మిలియనీర్స్, బిలియనీర్లు.. ఇలా అందరూ ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఎవరిని చూడాలో తెలియమి పరిస్థితి అభిమానులది. ముఖ్యంగా.. ఒకే స్టేజిపై అంతమంది స్టార్ హీరోలతో డ్యాన్స్ చేయించిన ఘనత ముకేశ్ అంబానీకే చెందుతుందని కొంతమంది నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే .. ఇంతకన్నా గొప్పగా .. టాలీవుడ్ స్టార్ హీరోస్ మొత్తాన్ని ఒకే స్టేజిపై డ్యాన్స్ చేయించాడు మెగాస్టార్ చిరంజీవి.
ఇప్పుడంటే.. ఇద్దరు స్టార్ హీరోలు ఒక స్టేజిపై డ్యాన్స్ చేస్తే.. వావ్.. సూపర్ అని పొగిడేస్తున్నారు. కానీ, మెగాస్టార్ తన కూతురు పెళ్ళికి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. స్టార్ హీరోలందరూ ఆ పెళ్ళిలో డ్యాన్స్ వేశారు. వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ, శ్రీకాంత్, లారెన్స్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగబాబు, ఆలీ.. ఇలా టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నారో అంతమంది ఆ పెళ్ళిలో డ్యాన్స్ వేసి అలరించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంబానీ పెళ్ళిలో ఈ స్టార్ హీరోలందరూ పనులు మానుకొని ఎందుకు వచ్చారంటే.. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. ఏంటి నిజమా అంటే నిజమే. పెద్ద పెద్ద కోటీశ్వరులు తమ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కు సెలబ్రిటీలను డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు. ఇక అంబానీ పెళ్ళిలో కూడా బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా అలా వచ్చినవారే అని టాక్ నడుస్తోంది. వీరి రెమ్యూనిరేషన్ కూడా కోట్లలో ఉంటుందని సమాచారం.
ముకేశ్ పెళ్ళిలోలా చిరు కూతురు పెళ్ళిలో డ్యాన్స్ వేసిన ఈ స్టార్ హీరోలందరూ పెయిడ్ ఆర్టిస్టులు కాదు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. చిరు కుటుంబంలో మొట్ట మొదటి శుభకార్యం కావడంతో ఆయన ఇండస్ట్రీ మొత్తాన్ని ఆహ్వానించాడు. ఆయన మీద ఉన్న గౌరవంతో ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చింది సుస్మిత పెళ్లి సంగీత్ లో ఈ స్టార్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఫ్యాన్స్ వార్ నడుపుతున్న ప్రతి ఒక్కరు అప్పటి ఈ వీడియోలు చూస్తే.. అప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉండేది అనేది తెలుస్తోంది. ఇక ఈ వీడియోలను మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు అభిమానులు. ముకేశ్ అంబానీ ఇప్పుడు చేశాడు.. కానీ, చిరు ఎప్పుడో చేశాడు.. అది మెగాస్టార్ అంటే.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా ఆ రోజులు మళ్లీ తిరిగి రావనే చెప్పాలి అని కొంతమంది చెప్పుకొస్తున్నారు.
This was our 'Anant Ambani's Pre – wedding' back then 😭❤️🔥
pic.twitter.com/TIapEugGu3— Aadhii 🫀 (@TemperLepaku) March 4, 2024
