NTV Telugu Site icon

Bholaa Shankar: ‘భోళా శంకర్’కి బాధ్యతలు పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి

Bhola Shankar Dubbing Completed

Bhola Shankar Dubbing Completed

Chiranjeevi Completes Bholaa Shankar dubbing: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భోళాశంకర్. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాళం |సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఆయన సోదరి పాత్రలో మాత్రం కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఒక లవర్ బాయ్ తరహా పాత్రలో అక్కినేని హీరో సుశాంత్ నటించిన ఈ సినిమాలో తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ కాస్ట్ చాలా వరకు భాగమయ్యారు.

Tillu Square : విడుదల తేదీని మార్చేసిన చిత్ర యూనిట్.. మరి విడుదల ఎప్పుడంటే..?

ఇప్పటికే ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పిన సినిమా యూనిట్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. ఈ మధ్యనే సినిమా షూటింగ్ పార్ట్ పూర్తికాగా ఇప్పుడు తన డబ్బింగ్ కూడా పూర్తయినట్లుగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. డబ్బింగ్ పూర్తయింది, సినిమా షేప్ అయిన విధానం చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఫైనల్ గా ఇది ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్, మీ అందరినీ థియేటర్లలో కలవడానికి సిద్ధంగా ఉన్నాను, డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి న్యూయార్క్ వెకేషన్ కి వెళ్ళబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆగస్టు నెలలో ప్రమోషన్స్ మొదలుపెట్టే లోపు ఆయన మళ్లీ హైదరాబాద్ రావాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక భోళా శంకర్ ప్రమోషన్స్ పూర్తయిన వెంటనే ఆయన కళ్యాణ్ కృష్ణ ప్రమోషన్స్ మొదలు పెట్టాల్సి ఉంది.