పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనూ మరోవైపు ఆఫ్లైన్ లోను ప్రముఖులు ఆయనను విష్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై ప్రేమ కురిపించారు. “చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్, పవన్ కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ చిరు చేసిన ట్వీట్ పవన్ తో పాటు మెగాభిమానులకు ప్రత్యేకంగా మారింది.
Read Also : పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..!
మరోవైపు పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమాలు అప్డేట్స్ మెగా అభిమానులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన నటిస్తున్న నటించబోతున్న 4 సినిమా లోనుంచి ఈ ఒక్కరోజే అప్డేట్స్ రానున్నాయి. వాటి సంబంధించి ఇప్పటికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మెగా అభిమానులు ఫుల్ పవర్ లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేయనున్నారు.
