Bhola Shankar: మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘భోళా శంకర్’. ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో నెగటివ్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంది. వీక్ మేకింగ్ భోళా శంకర్ సినిమాపై విమర్శలు వచ్చేలా చేసాయి. వేదాళం సినిమా తమిళనాడులో సూపర్ హిట్ అయ్యింది అంటే కథలో కచ్చితంగా విషయం ఉంటుంది. ఇక్కడ ఫ్లాప్ అయ్యింది అంటే తెలుగు ఆడియన్స్ కి తగ్గట్లు మార్పులు చేయకపోవడం, మెహర్ ఓల్డ్ స్కూల్ మేకింగ్ లో ఉండిపోవడమే కారణం అయ్యి ఉంటుంది. చిరు వరకూ భోళా శంకర్ గా ఎప్పటిలాగే తన మార్క్ మాస్ ఎలిమెంట్స్ అండ్ కామెడీ టైమింగ్ తో ఇంప్రెస్ చేసాడు. ఈ ఒక్క కారణమే మెగా ఫ్యాన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. మొదటి రోజు మార్నింగ్ షోకె నెగటివ్ టాక్ వచ్చింది కాబట్టి భోళా శంకర్ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందా అంటే కష్టమనే చెప్పాలి.
వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరు నుంచి ఇంకో సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుతాయో అని అందరు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిదేమి భోళా శంకర్ విషయంలో జరగలేదు. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా భోళా శంకర్ సినిమా 30 కోట్లని కూడా రాబట్టలేకపోయింది. నైజాంలో అయితే భోళా శంకర్ సినిమా నాలుగున్నర కోటి మాత్రమే రాబట్టింది. ఇది చిరంజీవి సినిమాల్లోనే అతి తక్కువ కలెక్షన్స్ లో ఒకటి అనే చెప్పాలి. ఒక యావరేజ్ టాక్ వచ్చే సినిమాని ఇచ్చినా చిరు తన మేనియాతో దాన్ని బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుస్తాడు. ఆయన చరిష్మా యావరేజ్ సినిమాని కూడా కాపాడగలదు. మెగా ఫ్యాన్స్ కూడా మంచి ఎలిమెంట్స్ ఉంటే కాస్త అటు ఇటు ఉన్న సినిమాని కూడా సూపర్ హిట్ గా చేస్తారు. మెహర్ రమేష్ కనీసం ఆ అవకాశం కూడా అభిమానులకి ఇవ్వలేదు. ఇక ఇప్పుడు వీకెండ్ కి కలెక్షన్స్ పుంజుకోని ఆడియన్స్ థియేటర్స్ కి వస్తే భోళా శంకర్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది లేదంటే బయ్యర్స్ కి భారీ నష్టాలు తప్పేలా లేవు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!