NTV Telugu Site icon

Telangana Slang: మొన్న బాలయ్య, ఇప్పుడు చిరు.. తెలంగాణ యాసలో రచ్చ లేపుడే!

Chiranjeevi Balakrishna Usi

Chiranjeevi Balakrishna Usi

Chiranjeevi uses telangana slang in bhola shankar: ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో ఎక్కువగా వాడేవారు కాదు. ఎక్కువగా అచ్చమైన తెలుగు భాషను అప్పుడప్పుడు విలన్లకు రాయలసీమ యాసను, తెలంగాణ యాసను మాత్రమే వాడుతూ ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ యాస ఉన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఫిదా ఆ తర్వాత బలగం, దసరా, ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ చేత కూడా ఇదే విధమైన తెలంగాణ యాస మాట్లాడించడంతో ఇప్పుడు తెలంగాణ యాస మీద కూడా అందరికీ సెంటిమెంట్ ఏర్పడుతోంది. తెలంగాణ యాస వుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కూడా భగవంత్ కేసరి సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం భోళా శంకర్ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతున్నట్టుగా తేలిపోయింది.
Rashmi Gautam Hot: రష్మీ కూడా క్లీవేజ్ షో మొదలెట్టేసింది.. లేటెస్ట్ ఫొటోలు చూశారా?
తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాకి సంబంధించిన టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఒక్కసారిగా ప్రేక్షకులలో అంచనాలు పెంచే విధంగా సాగింది. ఇక ఈ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న బాలకృష్ణ, ఇప్పుడు చిరంజీవి కూడా తెలంగాణ యాసలోనే మాట్లాడుతూ ఉండడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మెగా అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్గా తమన్నా భాటియా నటిస్తుండగా సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్ ఒక లవర్ బాయ్ తరహా పాత్రలో నటిస్తుండగా ఆయన కీర్తి సురేష్ కి జోడిగా నటిస్తున్నాడని ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు..