Site icon NTV Telugu

Chiranjeevi: 42 శాతం టాక్స్ కడుతున్నాం.. ప్రభుత్వాన్ని తిరిగి అడిగితే తప్పేంటీ..?

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో “చిరంజీవి  సినిమా అంటేనే అన్ని థియేటర్స్  హౌస్ ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు ‘ఆచార్య’కి టికెట్ రేటు పెంచవలసినన అవసరం ఉందా?’ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చిరు మాట్లాడుతూ” పాండమిక్ కారణంగా చాలా రంగాలు కుదేలయ్యాయి. అలా సినిమా పరిశ్రమ కూడా  చాలా ఇబ్బందుల్లో పడింది. వడ్డీగా 50 కోట్లను కట్టడమనేది ఎప్పుడైనా విన్నారా? ఎవరిస్తారు చెప్పండి?.

ప్రభుత్వాలు కనికరించి ఇలాంటి జీవోలు ఇస్తే మనకి ఇంత వినోదాన్ని ఇచ్చారు మనం కూడా ఒక పది రూపాయలు  ఇద్దామని ప్రేక్షకులు అనుకుంటారు. ఇది అడుక్కుతినడం కాదు. వినోదాన్ని అందించే ప్రయత్నంలో అనుకోకుండా అంతకంతకీ వడ్డీలు అయ్యాయి. వడ్డీనే ఒక మీడియం సినిమా బడ్జెట్ అంత అయింది. మేము కూడా 42 పర్సెంట్ టాక్స్ లు కడుతున్నాము. అందులో కొద్దిగా తిరిగి ఇవ్వండి అని అడగడంలో తప్పేమి లేదు.. తప్పు అని కూడా అనుకోవడం లేదు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వైకాయ్లు నెట్టింట వైరల్ గా మారాయి.

 

Exit mobile version