Site icon NTV Telugu

Chiranjeevi: అనిల్ సుంకరకు చిరంజీవి భరోసా?

Chiranjeevi Anil Sunkara

Chiranjeevi Anil Sunkara

Chiranjeevi assurance to anil sunkara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాళం సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ అందుకుంది. ఒకరకంగా ఈ సినిమాతో భారీ ఎత్తున నిర్మాత అనిల్ సుంకర నష్టపోయినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్సైడ్ వర్గాల సమాచారం మేరకు నిజానికి ఈ సినిమాను ముందుగా అనిల్ సుంకర, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కేఎస్ రామారావు కలిసి నిర్మించాలని అనుకున్నారు. చిరంజీవి రెమ్యూనరేషన్తో పాటు వాటాదారుడుగా కూడా ఉండాలని అనుకున్నారు. అయితే ముగ్గురు మీద వాటర్ కుదరక కేవలం రెమ్యూనరేషన్ తీసుకుని నటిస్తానని చెప్పి 60 కోట్లు రెమ్యూనరేషన్ గా ఫిక్స్ చేసుకున్నారు. ఆ తరువాత కేఎస్ రామారావు సినిమా నుంచి తప్పుకున్నారు.

Mirnaa Menon: రజినీకాంత్ రీల్ కోడలు ఏంట్రా.. బయట ఇంత హాట్ గా ఉంది

అయితే మామూలుగానే ఇండస్ట్రీ లెక్కల ప్రకారం రిలీజ్ కి ముందు దాదాపు మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ అంతా క్లియర్ అయింది. అయితే విడుదల అయ్యాక సినిమాకి డిజాస్టర్ టాక్ రావడంతో పాటు నష్టాలు వస్తున్నాయి అనే విషయం తెలుసుకొని కొంత అమౌంట్ వెనక్కి ఇవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అనిల్ సుంకర దృష్టికి తీసుకు వెళ్తే ఆయన దానికి ఒప్పుకోలేదని అంటున్నారు. తనతో మరొక సినిమా చేసే అవకాశం ఇవ్వాలని అని చిరంజీవిని కోరగా వెంటనే దానికి చిరంజీవి ఒప్పుకున్నారని కచ్చితంగా ఆయనతో కలిసి సినిమా చేస్తానని హామీ ఇచ్చారని అంటున్నారు, చిరంజీవి హీరోగా ఆయన కుమార్తె సుస్మిత నిర్మాతగా ఈ నెల 22వ తేదీన ఒక సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ సినిమా పూర్తయిన తరువాత అనిల్ సుంకర నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దానికి దర్శకుడు ఎవరు? కథ ఏమిటి? వంటి కాంబినేషన్లు ఇంకా సెట్ కాలేదని కానీ సుస్మితతో చేయబోయే సినిమా తర్వాత సినిమా మాత్రం ఖచ్చితంగా అనిల్ సుంకర నిర్మాణంలోనే ఉండబోతుందని తెలుస్తోంది.

Exit mobile version