NTV Telugu Site icon

Chiranjeevi: మరో రీమేక్ తో రెడీ అవుతున్న చిరు.. ఈ సారి అంతకు మించి!

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ్ లో హిట్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ అన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత చిరు.. కుర్ర డైరెక్టర్లతో కలిసి పనిచేయనున్నాడు. ఈ విషయం తెలియడంతో కొత్త కథలు వస్తాయని అభిమానులు ఆశించారు. అయితే కొత్త డైరెక్టర్ లతో కూడా చిరు రీమేక్ ప్లాన్ చేస్తున్నాడు అని తెలిసేసరికి అభిమానులు అవాక్కవుతున్నారు. గత కొన్నిరోజులుగా చిరు- కళ్యాణ్ కృష్ణ కాంబోలో బ్రో డాడీ రీమేక్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ కన్నా ముందు రాముడిగా నటించిన హీరోలు వీరే..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ రీమేక్ వార్తలు నిజమే అని అంటున్నారు. ఇందులో చిరుతో పాటు సిద్దు జొన్నలగడ్డ ఈ చిత్రంలో మరో హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన త్రిష.. సిద్దు సరసన శ్రీలీల నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం సిద్దు ఓ రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించేందుకు గాను సిద్దు జొన్నలగడ్డకు రూ.4 కోట్ల పారితోషికం అందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. చిరు.. మరో రీమేక్ అనేసరికి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అన్నా మళ్లీ రీమేక్.. మాపై అంత కోపం ఎందుకు..? అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments