NTV Telugu Site icon

Chiranjeevi: జవాన్ పాటకు చిరు స్టెప్స్.. ఆ గ్రేస్ ను ఎవరు కొట్టలేరు అంతే

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గురించి చెప్పడం ఎవరి వలన కాదు. ఇప్పటివరకు ఏ హీరో కానీ,ఏ ప్రేక్షకుడు కానీ.. చిరు డ్యాన్స్ కు పేరు పెట్టింది లేదు. అరవై వయస్సులో కూడా ఆ గ్రేస్ ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు అంటే అతిశయోక్తి కాదు. డ్యాన్స్ లో చిరు ఎన్నో రికార్డులు కొట్టాడు. ఇప్పటికీ ఆయన డ్యాన్స్ కోసమే థియేటర్ కు వెళ్లే ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా పార్టీల్లో చిరు వేసే స్టెప్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్స్టాంట్ గా ఆ మ్యూజిక్ కు తగ్గట్లు ఆయన వేసే స్టెప్స్.. ఆ గ్రేస్.. ను కొట్టేవారు లేరు. ఇక తాజాగా మరోసారి తన డ్యాన్స్ తో అభిమానులను అలరించాడు. ఇటీవలే దీపావళీ సెలబ్రేషన్స్ మెగాస్టార్ ఇంట గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే. టాలీవుడ్ మొత్తం ఈ పార్టీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్, వెంకటేష్, మహేష్ బాబు, మంచు లక్ష్మీ.. తదితరులు ఈ పార్టీలో సందడి చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను ఏ రేంజ్ లో షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

NTR: నా మీద కక్ష కట్టి.. నాకు చిరాకు అని తెలిసినా అతను ఆ పని చేస్తున్నాడు

ఇక ఈ పార్టీ నుంచి చిరు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో జవాన్ టైటిల్ ట్రాక్ కు చిరు స్టెప్స్ వేసి అలరించాడు. ఈ సాంగ్ లో వచ్చిన ర్యాప్ పాడిన అమెరికన్ ర్యాప్ సింగర్ రాజకుమారి లైవ్ లో పాడుతుండగా.. చిరు ఆ మ్యూజిక్ కు తగ్గట్టు డ్యాన్స్ వేసి అదరగొట్టాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. బాస్.. ఎప్పటికీ బాస్ నే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం చిరు.. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Show comments