మెగాస్టార్ చిరంజీవి 155వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఈ రోజు ఉదయం మహేష్ బాబు రివీల్ చేశారు. “చిరు 155” మూవీ తమిళ బ్లాక్ బస్టర్ “వేదాళం”కు రీమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల నుంచి వరుస అప్డేట్లు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా “చిరు155” మూవీ టైటిల్ ను ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ మెహర్ రమేష్‌తో కలిసి పని చేయడానికి చిరు సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి నిన్న ప్రకటన చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు సినిమా టైటిల్‌ను ఆవిష్కరించారు.
Read Also : మెగాస్టార్ బర్త్ డే… ట్విట్టర్ స్పేస్ సెషన్ లో ప్రముఖుల సందడి
చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయడం గర్వకారణం అని తెలిపారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టైటిల్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. మూవీకి “భోళా శంకర్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రం 2022లో విడుదల కానుంది. ఒక చిన్న మోషన్ పోస్టర్ ద్వారా ప్రాజెక్ట్ టైటిల్ లోగోను ఆవిష్కరించారు. ఈ లోగోను చూస్తుంటే సినిమా దేవుళ్ళ నేపథ్యంలో రూపొందే అవకాశం కన్పిస్తోంది. “భోళా శంకర్”లో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ కనిపిస్తుంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “భోళా శంకర్”కు మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.
