Site icon NTV Telugu

చిరంజీవి, బాలకృష్ణ అతిథులుగా 30న ‘ఆర్ఆర్ఆర్’ రోరింగ్ ఈవెంట్

Chiranjeevi as a guest for Balakrishna Talk Show

దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్ ప్లాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు రాజమౌళి బాలీవుడ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగిందన్న విషయం తెలిసిందే. అది త్వరలోనే ఓ ఛానల్ లో ప్రసారం కానుంది. ఇక తాజాగా ప్రో కబడ్డీ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ టీం సందడి చేసి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం జక్కన్న తన సినిమా కోసం టాలీవుడ్ బడా స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలను ఒకే వేదిక పైకి తీసుకురాబోతున్నాడట.

చిరంజీవి, బాలకృష్ణ అతిథులుగా 30న ‘ఆర్ఆర్ఆర్’ రోరింగ్ ఈవెంట్
మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ జనవరి 7న విడుదలకు ముస్తాబవుతోంది. సినిమా అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా కోసం యూనిట్ భారీ స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తోంది. టాలీవుడ్ బడా ఫ్యామిలీలకు చెందిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటించటం, రాజమౌళి దర్శకత్వం వహించటంతో పాటు ఎంచుకున్న కథాంశం, విడుదలైన ట్రైలర్, పాటలు ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల అవుతున్న ఈ సినిమా ప్రచారం కోసం ‘ఆర్ఆర్ఆర్’ త్రయం సుడిగాలిలా ఉత్తరదక్షిణాలను చుట్టేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా ముంబైలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించి మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇవ్వటంలో బిజీగా ఉంది యూనిట్.

ఇదిలా ఉంటే ఈ నెల 30న హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది రాజమౌళి బృదం. ఈ రోరింగ్ ఈవెంట్ కు అతిథులుగా చిరంజీవి, బాలకృష్ణ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. నందమూరి తారకరామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన ఈ సినిమా కోసం నందమూరి వంశం నుంచి నందమూరి నటసింహం బాలకృష్ణ, కొణిదెల ఫ్యామిలి నుంచి మెగాస్టార్ చిరంజీవి హాజరైతే ఇంతకు మించిన ఆనందం అభిమానులకు ఏముంటుంది. ఈ వేడుక గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల స్పూర్తితో ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని రూపొందించారు రాజమౌళి. ఇందులో భీమ్ గా ఎన్టీఆర్, రామరాజు గా రామ్ చరణ్ నటించగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవగన్, శ్రియా, సముతిర ఖని ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. డివీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.

Read Also :

https://ntvtelugu.com/kangana-may-appear-before-mumai-police-today-on-sikh-controversy/
Exit mobile version