Site icon NTV Telugu

Chinmayi: నేను ఎలాంటివాడు కావాలనుకున్నానో అతడే ఇతను

chinmayi

chinmayi

టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయమే చేయాల్సిన పనే లేదు. ఆమె మధురమైన గొంతుకు వినని వారు లేరు. ఆమె వాయిస్ ఎంతోమందికి ఫెవరేట్ . ఇక సింగర్ గా కాకుండా చిన్మయి సోషల్ మీడియాలో మరింత ఫేమస్. ఆడవారికి అవమానం జరిగిందని తెలిస్తే చాలు తన తరపున గొంతు ఎత్తి అన్యాయాన్ని ఎదిరిస్తుంది. ఇక మీటూ ఉద్యమంలో చిన్మయి చేసిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. ఇక ఆమెకు తోడుగా, ఎప్పుడు సపోర్ట్ గా నిలుస్తాడు చిన్మయి భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తారకు పరిచయమైన ఈ హీరో ‘చిలసౌ’ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు. ఇక ఆ తరువాత నాగార్జున తో ‘మన్మధుడు 2’ తీసి భారీ పరాజయాన్ని మూటకట్టుకున్నాడు. ప్రస్తుతం మరో కొత్త సినిమాతో ప్రేక్షకుక్లుల ముందుకు రానున్నాడు.

ఇకపోతే ఈ జంట నేడు తమ 8 వ వివాహ వార్షికోత్సవంజరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భర్త రాహుల్ గురించి చిన్మయి ఒక అద్భుతమైన పోస్ట్ తో వివావా వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది. ” ఈ మనిషి. అతనిని పెళ్లి చేసుకోవడం నా జీవితంలో జరిగిన గొప్ప విషయం.   నేను ఏది కోరుకుంటున్నానో, ఏది కావాలనుకుంటున్నానో అలా సేచ్ఛగా, సంతోషంగా ఉండగలను. అతను కష్ట సమయాలను సులభతరం చేశాడు.  పరిపూర్ణ భాగస్వాములు కూడా ఉన్నారు. ఇదుగో ఇక్కడ ఉన్న మానవుడే రుజువు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు వీరికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

 

Exit mobile version