Chinmayi Indirect Comments on Rashmika Deep Fake Video Goes Viral: ప్రస్తుతం ఎక్కడ చూసిన రష్మిక మందన్న ఫేక్ వీడియో గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలను రూపొందించడం చాలా సులభం కావడంతో జరా పటేల్ అనే యువతి వీడియోలో, రష్మిక ఫేస్ ను సూపర్మోస్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో అని సామాన్యులెవరూ తెలుసుకోలేని విధంగా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. దీని పై అమితాబ్ బచ్చన్, నాగ చైతన్య సహా పలువురు ప్రముఖులు స్పందించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరగా తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన వ్యాఖ్యలు మాత్రం కలకలం రేపుతున్నాయి. గార్బేజ్ లాజిక్ అలెర్ట్ అంటూ ఒక పోస్టు పెట్టిన ఆమె రష్మిక పేరు వాడకుండా ఆ నటి మామూలుగానే ఎక్స్ పోజింగ్ చేస్తుంది, ఆమె వేసుకునే బట్టలు అన్నీ కనిపించేలానే ఉంటాయి.
Game Changer : ‘జరగండి’ పాట వాయిదా.. తీవ్ర నిరాశలో మెగా ఫ్యాన్స్..
ఇప్పుడు మార్ఫ్ అయిన వీడియోల గురించి డ్రామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ఈ వీడియో వైరల్ అయిన మొదటి రోజున మాత్రం అయితే ఇలా ఫేక్ పిక్చర్స్ క్రియేట్ చేయడం వల్ల సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారని, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మహిళలను దోచుకోవడం, బ్లాక్‌మెయిల్ చేయడం, అత్యాచారం చేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాక అప్పుడు కూడా రష్మిక కోసం వాడిన అమ్మాయి బాగానే ఉందా లేదా అని తనకు అనుమానం ఉందని కూడా చెప్పుకొచ్చింది. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఒరిజినల్ వీడియో బ్రిటీష్ ఇండియన్ జారా పటేల్ ది. జరా లిఫ్ట్‌లోకి దిగిన వీడియోలో జరా పటేల్ ముఖానికి రష్మిక ముఖాన్ని జోడించారు.