Site icon NTV Telugu

Chinmayi: నాలుగేళ్ల బ్యాన్ తర్వాత డబ్బింగ్ చెప్పిన చిన్మయి… హ్యాపీనెస్ తో సామ్ పోస్ట్

Chinmayi

Chinmayi

లిరిసిస్ట్ వైరముత్తుపై సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడు అనే కామెంట్స్ చేసి సింగర్ చిన్మయి తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. ఈ సంఘటన తర్వాత నుంచి చిన్మయి సెక్సువల్ హరాస్మెంట్ విషయంలో సైలెంట్ గా ఉంటున్న వారికి వాయిస్ అవుతూ వచ్చింది. తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని చిన్మయి అడ్రెస్ చేస్తూ సోషల్ మీడియాలో అవేర్నెస్ పెంచే పనిలో ఉంది. ఎన్నో త్రేట్స్ కూడా ఫేస్ చేసిన చిన్మయిని కోలీవుడ్ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసింది. దాదాపు నాలుగేళ్లుగా చిన్మయి తమిళ్ లో పాట పాడలేదు, డబ్బింగ్ కూడా చెప్పలేదు. తెలుగులో తన పని తాను చేసుకుంటూ పోయిన చిన్మయి ఎట్టకేలకు కోలీవుడ్ లో మళ్లీ డబ్బింగ్ చెప్పింది.

Read Also: Atlee : ఈ సారి టార్గెట్ 3000 కోట్లు అంటున్న దర్శకుడు అట్లీ..

లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న లియో సినిమాలో త్రిష క్యారెక్టర్ కి చిన్మయి డబ్బింగ్ చెప్పింది. త్రిష చేసిన యాక్టింగ్ ని జస్టిస్ చేయాలంటే చిన్మయి ఉండాల్సిందే అందుకే ఆమెతో ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పించమని లోకేష్ కనగరాజ్ చెప్పాడు. తమిళ్ లో మాత్రమే కాదు లియో సినిమా రిలీజ్ అయ్యే అన్ని భాషల్లో త్రిష క్యారెక్టర్ ని చిన్మయినే డబ్బింగ్ చెప్పింది. నాలుగేళ్ల తర్వాత తమిళ్ లో డబ్బింగ్ చెప్పిన చిన్మయి ఎమోషనల్ అవుతూ ట్వీట్స్ చేసింది. తన క్లోజ్ ఫ్రెండ్ కి సపోర్ట్ గా సమంత కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Exit mobile version