NTV Telugu Site icon

Cheater: ‘చీటర్’ వచ్చేస్తున్నాడు.. బీ రెడీ!

Cheater

Cheater

Cheater Movie First Look launched: ఈ మధ్య కాలంలో టైటిల్స్ తోనే ఇంట్రెస్ట్ రేకెత్తిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ క్రమంలోనే “చీటర్” అనే సినిమా తెరకెక్కగా ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శకుడు త్రినాథరావు నక్కిన. యస్.ఆర్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మాత గా, బర్ల నారాయణ దర్శకత్వంలో ఈ ” చీటర్ ” సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధం అయింది. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ప్రముఖ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన విడుదల చేశారు.

Allu Arjun: పిల్లనిచ్చిన మామ కోసం సాగర్‌లో సందడి చేసిన అల్లు అర్జున్

ఈ క్రమంలో త్రినాధ రావు మాట్లాడుతూ “సినిమా ఫస్ట్ లుక్ చూసాను చాలా బాగుంది, టీం అందరికీ మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నానని అన్నారు. డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ మా సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించడం జరిగిందని, మ్యాంగో మ్యూజిక్ ద్వారా 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి మంచి రెస్పాన్స్ రావడం జరిగిందని అన్నారు. నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “మేము అనుకున్నట్టు సినిమా వచ్చింది, మా డైరెక్టర్ అనుకున్న దానికంటే బాగా కష్టపడి పని చేశారు, మంచి అవుట్ పుట్ వచ్చిందని అన్నారు. ప్రేక్షకులకు పక్కా నచ్చుతుంది, సెప్టెంబర్ 22న థియేటర్లలో విడుదల అవుతుందని, మంచి సినిమా ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని నమ్మకం ఉంది” అని తెలిపారు.