Che Long Live Movie Trailer : క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న మూవీ “చే”, లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తుండగా ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “చే” ట్రైలర్‌ను రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా క్యూబా తరువాత ప్రపంచంలోనే తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇదని అంటున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు, రవిశంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకుని త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది.
Bandla Ganesh : అయ్యప్ప మాలలో బండ్లన్న అపచారం.. ఆడుకుంటున్న నెటిజన్లు..
ఇటీవలే చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసి సినిమా యూనిట్‌ను అభినందించారు. “చే” మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ.. “చేగువేరా బయోపిక్ తీయాలన్నది తన ఇరవై ఏళ్ల కల అని, విప్లవ వీరుడు చేగువేరా లైఫ్‌లో జరిగిన ఎన్నో అరుదైన విషయాలు తమ సినిమాలో చూపించినట్టు తెలిపారు. అనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు తెరకెక్కించామని, క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని అన్నారు . తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందన్న ఆయన ట్రైలర్ బాగుందంటూ పలువురు సినీ ప్రముఖుల నుంచి కాల్స్ వస్తున్నాయన్నారు. ఈ మూవీ పోస్టర్‌ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నట్టుపేర్కొన్న ఆయన ఈ చిత్రాన్ని డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు తెలిపారు.