Site icon NTV Telugu

Chatrapathi : డిజిటల్ రిలీజ్ కు మోక్షం కలిగేనా..?

Whatsapp Image 2023 07 13 At 5.06.10 Pm

Whatsapp Image 2023 07 13 At 5.06.10 Pm

బెల్లంకొండ శ్రీనివాస్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు ఈ హీరో. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఆ తరువాత చేసిన వరుస సినిమాలు నిరాశ పరిచాయి.మధ్యలో జయ జానకి నాయక, రాక్షసుడు వంటి సినిమాలతో మెప్పించిన అవి కమర్షియల్ గా అంతగా ఆడలేదు.ఈ క్రమంలో తన సినిమాలకు హిందీ డబ్బింగ్ లో వచ్చిన సెన్సేషనల్ వ్యూస్ ని చూసి డైరెక్ట్ గా సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు ఈ హీరో.తెలుగు లో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమాను వివి వినాయక్ డైరెక్షన్ లో హిందీలో అదే పేరుతో రీమేక్ చేసాడు.మే 12న సినిమాను కూడా విడుదల చేసారు.టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ అయినా వస్తాయి అని అంతా అనుకున్నారు.కానీ ఈ సినిమా నెట్ కలెక్షన్స్ కోటి రూపాయల లోపేవచ్చినట్లు సమాచారం.

ఈ సినిమా కోసం పబ్లిసిటీ ఖర్చులతో కలిపి దాదాపు 85 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. భారీ డిజస్టర్ గా నిలిచిన ఈ సినిమా..నాన్ థియేట్రికల్ రైట్స్ 35 కోట్ల రేటుకి సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను తీసుకున్న ఐదు వారాల లోపే డిజిటల్ విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ సినిమా విడుదల అయ్యి 2 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు సినిమా డిజిటల్ విడుదల పై ఎలాంటి అప్ డేట్ లేదు.సౌత్ ఆడియన్స్ హిందీ లో ఈ సినిమాను మిస్ చేసుకున్నా డిజిటల్ లో చూడాలి అనుకున్నారు కానీ ఇప్పటి వరకు డిజిటల్ విడుదల గురించి ఎలాంటి అప్ డేట్ అయితే లేదు.. మరి ఎప్పుడు సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుందో చూడాలి..ఈ సినిమా రిజల్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరోసారి బాలీవుడ్ లో సినిమా చేయాలంటే భయపడేంతగా చేసింది.

Exit mobile version