Site icon NTV Telugu

Actress Death: క్యాన్సర్‌తో మూడేళ్ల పోరాటం.. చికిత్స అందక నటి మృతి!

Vijayalakshmi Death

Vijayalakshmi Death

Charecter Artist Vijyalakshmi Died with Cancer: పలు సినిమాలు, సీరియల్స్‌లో సహాయ పాత్రలు పోషించిన నటి విజయకుమారి క్యాన్సర్‌తో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. సెలబ్రిటీలు ఎక్కువగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే వార్తలను మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. క్యాన్సర్‌ని ముందుగానే గుర్తిస్తే, దాన్ని అదుపులోకి తెచ్చి, దాని నుండి బయట పదోచ్హు. క్యాన్సర్‌తో బాధపడుతున్న గౌతమి, హంసా నందిని, మనీషా కొయిరాలా వంటి నటీమణులు బతికి పోయారు. అదే సమయంలో ఇటీవల క్యాన్సర్‌ బారిన పడి ప్రముఖులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

Rana: లవ్ మౌళిలో రానా.. అందుకే దాచాం!

ఇళయరాజా కుమార్తె భవతరణి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. ఇక పలు సినిమాలు, సీరియల్స్‌లో సహాయ నటిగా నటించిన విజయకుమారి ఈరోజు ఉదయం క్యాన్సర్‌తో మరణించినట్లు సమాచారం. ఈరోడ్ జిల్లాకు చెందిన ఆమె చెన్నైలోని వలసరవాక్కంలో ఉంటూ సీరియల్స్, సినిమాల్లో నటించేదని చెబుతున్నారు. మూడో దశలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె మూడేళ్లుగా చికిత్స పొందుతున్నారు. అయితే నిరంతరం చికిత్స చేయించేంత డబ్బు లేకపోవడంతో ఆమె తన చికిత్సలో సహాయం కోసం KPY బాల మరియు ఇతరుల సహాయం కోరింది. కొందరు ఆమెకు సహాయం చేశారు కూడా. అయితే చికిత్స అందక ఈరోజు ఉదయం ఆమె మృతి చెందారు. ఆమె మృతి పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Exit mobile version