‘ఆర్ఆర్ఆర్’… కేవలం తెలుగులోనే కాదు హిందీ నుంచీ మలయాళం దాకా అన్ని భాషల్లో, అందరూ ఎదురు చూస్తోన్న క్రేజీ మల్టీ స్టారర్. తొలిసారి ఎన్టీఆర్, చరణ్ కలసి నటిస్తోన్న ఈ హై ఓల్టేజ్ పాట్రియాటిక్ డ్రామా చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. డైరెక్టర్ రాజమౌళి పూర్తిగా రిలీజ్ మూడ్ లోకి వెళ్లిపోయాడు. ఇంకా చాలా పని మిగిలే ఉన్నా సినిమాని వేగంగా విడుదలకి సిద్దం చేస్తున్నారు. అయితే, అదే రేంజ్లో ఫ్యాన్స్ కి సొషల్ మీడియాలో సర్ ప్రైజ్ లు కూడా ఇస్తున్నారు.
Read Also: పెళ్ళి ప్లాన్స్ చెప్పేసిన కియారా !
కొన్నాళ్ల కిందటే ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సెట్ మీద నుంచీ ఓ ఫోటో షేర్ చేశాడు. చాలా ఏళ్ల తరువాత ఐడి కార్డ్ మెడలో వేసుకున్నాను అంటూ కొత్త లుక్ ప్రదర్శించాడు. అది అభిమానుల్లో వైరల్ అయింది. ఇక తాజాగా ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తోన్న ఫారిన్ బ్యూటీ ఒలివియా మోరిస్ కూడా ఓ పిక్ షేర్ చేసింది ఇన్ స్టాగ్రామ్ లో. ఆమె కూడా ప్రస్తుతం ఉక్రెయిన్ లో, లాస్ట్ లెగ్ ఆఫ్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు హింట్ ఇచ్చింది! ఇక ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ మరో వీడియోతో ఫాన్స్ కి టచ్ లోకి వచ్చింది…
తారక్, చరణ్, జక్కన్న షూటింగ్ మధ్యలో సరదాగా గడిపే సమయాన్ని కెమెరాలో క్యాప్చర్ చేశారు! ముగ్గుర్ని అభిమానులకి చూపిస్తూ ‘చిల్లింగ్’ అంటూ ఓ కూల్ వీడియో ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు! ఎన్టీఆర్ ని కొమురం భీమ్ గా, చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తోన్న డై హార్డ్ ఫ్యాన్స్ కి ఈ వీడియో నిజంగా కిక్ ఇచ్చే ‘స్టఫ్ఫే’!