Site icon NTV Telugu

Man of Masses: ఈ మాస్ ట్యాగ్ గోలేంటి బాసు?

Charan Ntr

Charan Ntr

యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్.. ఇవి సరిపోవడం లేదు మెగా, నందమూరి అభిమానులకి. ఈ ఇరు హీరోల అభిమానులు ఇప్పుడో ట్యాగ్ కోసం సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు. ‘మా వాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మా వాడు మ్యాన్ ఆఫ్ మాసెస్’ అంటూ చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ ఒకటే ట్వీట్లు వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో #ManofMasses అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ట్యాగ్ కోసం ఒకరిని ఒకరు దూషించుకుంటూ, బూతులతో సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నారు. ఆ బూతులు ఇతర హీరోల అభిమానులు కూడా నవ్వుకునేలా ఉన్నాయి. అసలు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ అనేది ఒక బిరుదేనా? ఎందుకు దాని కోసం ఇలా హీరోల అభిమానులు కొట్లాడుకుంటున్నారు అనేది ఎవరికీ అర్ధం కాని విషయమే.

చరణ్, ఎన్టీఆర్‌ ల విషయం ఇలా ఉంటే.. సినీ అభిమానులు ‘బాస్ ఆఫ్ మాసెస్’ అని చిరంజీవిని, ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అని బాలయ్యని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరి విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. మెగాస్టార్ ‘బాస్ అఫ్ మాసేస్’, నటసింహం ‘గాడ్ ఆఫ్ మాసేస్’ అనేది అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు సమస్య మొత్తం ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ట్యాగ్ తోనే వచ్చింది. ఈ గొడవే ఎటూ తేలేలా కనబడటం లేదు. సినిమాను బట్టి, సినిమాలోని క్యారెక్టర్‌ని బట్టి ‘మాస్ హీరో’ అనే ట్యాగ్‌ని ప్రతి ఒక్కరూ వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ‘మాస్ హీరో’ అనే ట్యాగ్‌ ని రాజముద్రలా పేరు ముందు పడేలా చేసుకున్న హీరో ‘మాస్ మహారాజా రవితేజ’. ఆయన సినిమాల్లో మాసిజం ఎక్కువగా ఉండటంతో అభిమానులు ఆయన్ని మాస్ మహారాజాగా పిలుచుకుంటున్నారు. సో… మాస్ మహారాజ, గాడ్ ఆఫ్ మాసేస్, బాస్ ఆఫ్ మాసేస్ ట్యాగ్ లైన్స్ తో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వచ్చిన తలనొప్పి అంతా మాన్ ఆఫ్ మాసేస్ గురించే. అసలు చరణ్, ఎన్టీఆర్ లలో ఎవరు ‘మాన్ ఆఫ్ మాసేస్’ ట్యాగ్ లైన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అనే విషయం ఆయా హీరోల అభిమానులకే తెలుసు కానీ ఫ్యాన్ వార్స్ ఊరికే జరగవు కదా. ఇలా చిన్న చిన్న విషయాలకి ఆన్లైన్, ఆఫ్లైన్ అనే తేడా లేకుండా గొడవపడినప్పుడే అవి జరిగేది.

Exit mobile version