Site icon NTV Telugu

Acharya : చిరు, చెర్రీ రెమ్యూనరేషన్ తీసుకోలేదా?

Acharya

Acharya

“ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గురించి నిర్మాత నిరంజ్ రెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమా నిర్మాణంలో తండ్రీకొడుకులు తమ రెమ్యూనరేషన్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని, సినిమా విడుదలయ్యాక, దాని ఫలితాన్ని చూసి డబ్బులు తీసుకుంటామని చెప్పారని అన్నారు. బయట హీరోల రెమ్యూనరేషన్ గురించి ఏదేదో మాట్లాడతారని, అదంతా తప్పుడు ప్రచారమని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఆచార్య ఈ నెల 29న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచి హైప్ క్రియేట్ చేసింది.

Exit mobile version