NTV Telugu Site icon

Shehzada: ఓ మై గాడ్ డాడీ ప్లేస్ లో… క్యారెక్టర్ డీలా హై…

Shehzada

Shehzada

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బన్నీ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ఈ మూవీని హిందీలో ‘షెహజాదా’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అల్లు ఎంటర్టైన్మెంట్స్, హారికా హాసిని, భూషణ్ కుమార్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న షెహజాదా సినిమాపై బాలీవుడ్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈపాటికి వారం క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పఠాన్ దెబ్బకి ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీగా ఉంది. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, తాజాగా షెహజాదా నుంచి ‘క్యారెక్టర్ డీలా 2.0’ సాంగ్ ని రిలీజ్ చేశారు.

హిందీ కిక్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆల్రెడీ ‘క్యారెక్టర్ డీలా’ అనే సాంగ్ చేశాడు. ఈ పాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి పార్టీ వైబ్ ఉన్న పాటని కాస్త మార్పులు చేసి క్యారెక్టర్ డీలా 2.0 అని షెహజాదా సినిమాలో పెట్టారు. సాంగ్ లోని జోష్ కార్తీక్ ఆర్యన్ డాన్స్ లో కనిపిస్తుంది. షెహజాదా ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చిన ఈ పాట సినిమాపై హైప్ ని పెంచింది. తెలుగులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా ఉన్న ‘ఓ మై గాడ్ డాడీ’ సాంగ్ ప్లేస్ లో హిందీలో ‘క్యారెక్టర్ డీలా 2.0’ వచ్చేలా ఉంది. మరి టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన అల వైకుంఠపురములో సినిమా హిందీ బాక్సాఫీస్ ని కూడా రఫ్ఫాడిస్తుందేమో చూడాలి.