Chandu Mondeti confirms movie with Suriya: కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ చందు మొండేటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. నిజానికి నాగచైతన్యతో ఒక సినిమా ప్లాన్ చేసిన ఆయన ప్రస్తుతానికి ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక కోలీవుడ్ స్టార్ సూర్య కాంబినేషన్లో కూడా ఆయన ఒక సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ఈ విషయం మీద చందూ క్లారిటీ ఇచ్చారు. సూర్యతో చేయబోయే సినిమా గురించి చందూ మాట్లాడుతూ సూర్యతో చేయబోతున్న సినిమా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే నాలుగు వేదాల చుట్టూ ఈ సినిమా ఉంటుందని దర్శకుడు వివరించారు. ఈ ప్రాజెక్ట్ సోషియో-ఫాంటసీ జానర్‌లో సెట్ చేయబడిందని చెబుతున్నారు.
Tillu Square: ఏం .. రాధికా.. ఇంకా మా టిల్లుగాడిని వదలవా.. ?
వేదాల బ్యాక్ డ్రాప్ లో ఈ లైన్ ని ఇప్పటికే సూర్యకి వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ స్క్రిప్ట్ గురించి అడిగి తెలుసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్న సూర్య తర్వాత వెట్రిమారన్ డైరెక్షన్లో ఒక సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టారు. అయితే ఆయన కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక చందు మొండేటి సినిమా స్టార్ట్ అవ్వటానికి మినిమమ్ రెండేళ్లు పట్టే అవకాశం ఉంది కనుక ఈ గ్యాప్ లో నాగచైతన్య సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు చందు మొండేటి. పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా తన సత్తా చాటాలని భావిస్తున్నాడు చందు మొండేటి. ప్రస్తుతం కంగువా లాంటి పీరియాడిక్ సినిమా చేస్తున్న సూర్య, వేదాల బ్యాక్ డ్రాప్ లో మరో డిఫరెంట్ స్టోరీస్ లైన్లో పెట్టిన క్రమంలో ఈ సినిమాలో సూర్య పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.