NTV Telugu Site icon

Chandramukhi2: ఎక్కడో .. తేడా కొడుతుంది లారెన్స్ అన్నా

Raghava

Raghava

Chandramukhi2: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాలకు లారెన్స్ పెట్టింది పేరు. మనుషులు చనిపోవడం.. ఆత్మలుగా మారి.. లారెన్స్ బాడీని ఉపయోగించుకొని పగ తీర్చుకోవడం.. ఇలాంటి సినిమాలు తీసి లారెన్స్ మంచి హిట్స్ ను అందుకున్నాడు. ఇక ఏ సినిమాకు అయినా ఆయనే దర్శకత్వం వహించేవాడు. అయితే ఈసారి లారెన్స్ పంథా మార్చాడు. ఒక స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక హిట్ సినిమా సీక్వెల్ లో నటిస్తున్నాడు. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చంద్రముఖి 2. దాదాపు 18 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి కి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వాసు. ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు మేకర్స్ రిలీజ్ చేశారు. రాజా వెంకటపతి రాజుగా లారెన్స్ కనిపించాడు. చంద్రముఖి లో ఇదే పాత్రను రజినీకాంత్ చేశాడు. ఈ పాత్రలో ఇప్పుడు లారెన్స్ నటిస్తున్నాడు.

సామజవరగమన సినిమాలో నరేష్ టీషర్టుల మీద ఈ కొటేషన్స్ చూస్తే నవ్వాపుకోలేరు

ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ పోస్టర్ పై ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతుంది. పోస్టర్ లో లారెన్స్ తల అతికించినట్లు ఉందని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెల్సిందే. పొన్నియిన్ సెల్వన్ లో విక్రమ్ పోస్టర్ నుంచి మొదలైన ఈ ట్రోలింగ్.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె అంటూ సాగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు చంద్రముఖి 2 లో కూడా అదే తప్పు జరిగిందని అభిమానులు అంటున్నారు. మేకర్స్ కు ఆ మాత్రం తెలియడం లేదా అంటూ అభిమానులు ఏకిపారేస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు పోస్టరే బాలేదు అంటే.. సినిమాపై ఆసక్తి ఎలా కలుగుతుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఇలాంటి తప్పు మళ్లీ చేయకుండా సరిదిద్దుకుంటారా.. ? అనేది చూడాలి.

Show comments