Chandramukhi 2 got Benefit by Releasing on September 15: ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సలార్ వాస్తవానికి సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందని కాబట్టి సినిమా వాయిదా పడవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు కానీ సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన రావడం లేదు అని తెలిసిన తర్వాత అనేక సినిమాల రిలీజ్ డేట్లు మారిపోతున్నాయి. సలార్ రావడం లేదని తెలిసి ఇప్పటికే ఎన్టీఆర్ బావమరిది హీరోగా నటిస్తున్న మ్యాడ్ అనే సినిమా అదే రోజున రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు రూల్స్ రంజన్ అనే సినిమాని కూడా సెప్టెంబర్ 28వ తేదీన తీసుకొస్తున్నారు. మరోపక్క సెప్టెంబర్ 15వ తేదీన మూడు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. రామ్ బోయపాటి కాంబినేషన్ లో స్కంద, డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమాతో పాటుగా తమిళంలో తెరకెక్కిన చంద్రముఖి 2 తెలుగులో కూడా రిలీజ్ అయ్యేందుకు షెడ్యూల్ అయ్యాయి.
Samantha: మేనేజర్ మోసం.. తాడోపేడో తేల్చుకునేందుకు ల్యాండైన సమంత?
సెప్టెంబర్ 28వ తేదీ సలార్ రావడం లేదని తెలిసి ఇప్పుడు స్కంద సినిమాని అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులు కొనుక్కున్న దిల్ రాజు సూచనల మేరకు సెప్టెంబర్ 28వ తేదీకి రిలీజ్ డేట్ మార్చేందుకు సినిమా యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోపక్క టిల్లు స్క్వేర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదు కాబట్టి రిలీజ్ వాయిదా వేస్తున్నామని మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటిస్తామని సినిమా యూనిట్ ప్రకటించింది. ఒక్క ముక్కలో ఇవన్నీ పరిశీలిస్తే ప్రభాస్ సినిమా డేట్ మారడం వల్ల అనేక సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లు మారిపోయాయి. ముఖ్యంగా వినాయక చవితికి ఒక్క తెలుగు సినిమా రావడం లేదు సరి కదా అది చంద్రముఖి 2కి ప్లస్ పాయింట్ అయింది. కొంతవరకు పర్వాలేదు అనే టాక్ వచ్చినా ఈ సినిమాకి ఓపెనింగ్స్ గట్టిగా నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
