Chandrababu Biopic Telugodu Streaming in Youtube: కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు కానీ మొత్తంగా తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకరు. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆయన బయోపిక్ గా తెరకెక్కిన సినిమాను యూట్యూబ్లో రిలీజ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘తెలుగోడు’. ప్రపంచంపై తెలుగోడి సంతకం అనేది టాగ్ లైన్. విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. కథ, కథనం, మాటలు అందించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో డాక్టర్ వెంకీ మేడసాని ఈ చిత్రాన్ని నిర్మించగా తాజాగా యూట్యూబ్‌లో సినిమాను విడుదల చేశారు. గురువారం ఉదయం విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సినీ రంగంలో ఎటువంటి నేపథ్యం గానీ, అనుభవం గానీ లేని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ వెంకీ మేడసాని… తొలి ప్రయత్నంలో తెలుగు ప్రజానీకంపై తనదైన ముద్ర వేసిన చంద్రబాబు బయోపిక్ చేసి హాట్ టాపిక్ అయ్యారు.
Sivakarthikeyan : దళపతి విజయ్ మూవీలో శివకార్తికేయన్..?
ఇక ఈ సినిమా విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”చంద్రబాబు జీవితంలో, పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి, నన్ను ఆ అంశం ఎక్కువ ఆకర్షించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాలు గడిచినా పల్లెటూరి ప్రజల జీవితాలు మారలేదు, చంద్రబాబు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా! ఎటువంటి సామజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు. ఆ పాయింట్ మీద సినిమా తీశా” అని చెప్పారు. చంద్రబాబు పాత్రలో వినోద్ నటించిన ‘తెలుగోడు’ సినిమాకి సినిమాటోగ్రఫీ మల్లిక్ చంద్ర, సంగీతం: రాజేష్ రాజ్ అందిస్తున్నారు.
