Site icon NTV Telugu

Chandrabose: ఎం.ఎం శ్రీలేఖకి ఆస్కార్!

Chandrabose

Chandrabose

సినీ సంగీత రంగంలో 25 యేళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలు MM శ్రీలేఖ ఇంటికి ఆస్కార్ వచ్చింది. ఇటీవలే ప్రపంచ యాత్ర మొదలుపెట్టిన శ్రీలేఖకి ఆస్కార్ రావడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. RRR సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ అందుకున్న రచయిత చంద్రబోస్ గారు తనకు మొట్ట మొదటి అవకాశం ఇచ్చిన శ్రీలేఖ కు గురుదక్షిణగా ఇంటికి వచ్చి మరీ ఆస్కార్ అందించి అభినందనలు తెలిపారు. ఆస్కార్ తనకే వచ్చినంత ఆనందంగా ఉందని, SS రాజమౌళి అన్న సినిమా, కీరవాణి అన్న సంగీతం, తాను పరిచయం చేసిన చంద్రబోస్ సాహిత్యం ఆస్కార్ వేదిక మీద ఉన్నప్పుడు చెప్పలేనంత సంతోషం కలిగిందని, ఇప్పుడు ఆ ఆస్కార్ తన చేతికి అందడం మరింత ఆనందం కలిగిస్తోందని శ్రీలేఖ అన్నారు.

శ్రీలేఖ ఇంటికి వెళ్ళినట్లే చంద్రబోస్ తనకి “తాజ్ మహల్” సినిమాలో “మంచు కొండల్లోన చంద్రమా” పాటని రాసే అవకాశం ఇస్తూ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడిని గుర్తు చేసుకున్నాడు. రామా నాయుడు స్టూడియోస్‌కు వెళ్లి రామానాయుడు కుమారుడు, నిర్మాత సురేశ్‌బాబుని కలసిన చంద్రబోస్ ‘తాజ్ మహల్’ సినిమా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో మొదలైన నా ప్రయాణం ఆస్కార్‌ వరకు వెళ్లిందని చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆస్కార్ వేదికపై పైన వినిపించిన మొట్ట మొదటి తెలుగు పదం ‘నమస్తే’ అని, ఆ స్టేజ్ పైన వినిపించిన మొదటి తెలుగు పాటలోని ఫస్ట్ వర్డ్ ‘పొలం’ అని చెప్పిన చంద్రబోస్, ఈ రెండు పదాలు తెలుగు వాళ్లకి ఎంతో ప్రత్యేకమైనవి. ఆ రెండూ ఆస్కార్ వేదికపై వినిపించినందుకు తెలుగు వాడిగా గర్వంగా ఉందని చంద్రబోస్ తన సంతోషాన్ని తెలిపాడు.

Exit mobile version