Site icon NTV Telugu

Chandini Chowdary: తెలుగమ్మాయి బాగా ఫీల్ అయ్యినట్టు ఉంది.. చూసుకోవాలి కదా మావా

Chandini

Chandini

Chandini Chowdary: తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ.. అందులో ఒకరు చాందిని చౌదరి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాందిని ‘కలర్ ఫోటో’ చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతోంది. ఇక ఈ మధ్యనే ఆమె గామి సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమాలో చాందిని కనిపించింది కొద్దిసేపే అయినా కూడా మంచి గుర్తింపునే రాబట్టుకుంది. ఇక తాజాగా ఈ చిన్నది మీడియా మీద ఫైర్ అయ్యింది. ఏ ప్రెస్ మీట్ లో అయినా హీరోయిన్స్ ను అడిగే ప్రశ్నలు ఉండవా.. ? అంటూ రిపోర్టర్ల పై విరుచుకుపడింది. తిరుపతిలో గామి ప్రెస్ మీట్ ను నిర్వహించగా చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. ఇక రిపోర్టర్లు వరుసగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ విద్యాధర్ .. చివరికి నిర్మాతను కూడా వారు ప్రశ్నలు అడిగారు. హీరోయిన్ చాందినిని మాత్రం పట్టించుకోలేదు.

ఇక ఆమె మాట్లాడుతూ.. ” గామి సినిమా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను ఒకటి అడగలనుకుంటున్నాను. మీడియాకు హీరోయిన్లను అడగడానికి ఒక్క ప్రశ్న కూడా లేదా.. ? ఎప్పుడు హీరోయిన్లను ప్రశ్నలు అడగరు. మేల్ యాక్టర్స్, డైరెక్టర్స్ ను మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడే కాదు.. నేను మొదటినుంచి దీన్ని చూస్తున్నాను ” అని చెప్పగా.. వెంటనే ఒక రిపోర్టర్ ఆమెను ప్రశ్న అడగడానికి మైక్ పట్టుకోగా.. ఆమె అసహనంగా ఇప్పుడు వద్దులెండి.. ఏదో మొహమాటానికి అడిగినట్లు ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఇక ఇదంతా చూసిన విశ్వక్.. ఈ ప్రెస్ మీట్ మొత్తంలో ప్రశ్నలు అడగకపోయినా.. ఇప్పుడు నువ్వే ట్రెండ్ అవుతావు అంటూ సరదాగా ఆటపట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసాక అభిమానులు.. తెలుగమ్మాయి బాగా ఫీల్ అయ్యినట్టు ఉంది.. చూసుకోవాలి కదా మావా అంటూ రిపోర్టర్లపై సెటైర్లు వేస్తున్నారు.

Exit mobile version