NTV Telugu Site icon

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో బంఫర్ ఆఫర్.. ఆ సినిమాలో ఛాన్స్..

Meenakshi

Meenakshi

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇప్పుడు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది.. టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ కూడా పడింది.. ఏకంగా సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి..

ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే మహేష్ బాబు పక్కన శ్రీలీలా హైలెట్ అయ్యింది. కానీ ఈ అమ్మడుకు అంత క్రేజీ టాక్ అయితే అందుకోలేదు.. ఆమె ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యారు.. ఇప్పుడు మీనాక్షి వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ తన ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాతో పాటుగా దుల్కర్ లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తుంది..

ఇవే కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా లో కూడా హీరోయిన్ చేస్తుంది.. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అమ్మడు దగ్గరకు వచ్చింది. అనిల్ రావిపూడితో కొత్త సినిమా ప్రకటించారు వెంకీ.. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.. ఈ సినిమాలో కూడా ఈ అమ్మడును హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఇవ్వబోతున్నారు.. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Show comments