టాలెంటెడ్ ఆర్టిస్టులకు మంచి బ్రేక్ రావడం ఆలస్యం కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా. అలాంటి బ్రేక్ తోనే దూసుకుపోతున్నారు చైతన్య రావు.. తాజాగా ‘మయసభ’ వెబ్ సిరీస్, ‘ఘాటి’ ట్రైలర్ విడుదల తర్వాత చైతన్య రావు నటనకు, నటనలో చూపించిన వైవిధ్యానికి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే అది నిజమని అనిపిస్తుంది. ఈ రెండిటిలో ఆయన చూపించిన వేరియేషన్, మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఘాటి సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా చైతన్య రావు శనివారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
Also Read : Sreeleela : ఎన్టీఆర్ వల్లే శ్రీలీల కూచిపూడి నేర్చుకుంది..
‘ఇందులో నా పాత్ర రెగ్యులర్ విలన్‌లా ఉండదు. అసలు క్రిష్ నన్ను విలన్‌లా చూడలేదు. ఒక మెయిన్ క్యారెక్టర్‌లాగే ఇందులో నా రోల్ కీలకంగా, గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇదొక ఐకానిక్ క్యారెక్టర్. ఈస్ట్రన్ ఘాట్స్‌లో ఈ సినిమాను షూట్ చేశాం. ఇందులో ఓ జలపాతం సీన్ ఉంది.అక్కడ షూటింగ్ ఓ సాహసం అనే చెప్పాలి. ఇలాంటివి రిస్క్ సీన్స్ చలా చేశాం. మూవీ మొత్తం ఎక్స్‌ట్రార్డినరీ గా వచ్చింది. ముఖ్యంగా అనుష్క ఈ మూవీ కోసం చాలా కష్ట పడ్డారు. ఆ జలపాతం సీన్ లో అనుష్క కూడా ఉన్నారు ఆమె కూడా రిస్క్ చేశారు’ అని తెలిపారు. అలాగే ‘ ప్రజంట్ ‘యమసభ’ సిరీస్, ‘ఘాటీ’ సినిమా నా కెరీర్‌కి రెండు పిల్లర్స్ లాంటివని, ఫహాత్ ఫాజిల్, సత్యదేవ్‌లా అన్ని రకాల పాత్రలూ చేయాలనుందని, క్రాంతికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా’ అని చైతన్యరావు చెప్పారు.
