Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో సమంత- నాగచైతన్య విడిపోతే.. వారికన్నా ఎక్కువ బాధపడింది మాత్రం అభిమానులే అని చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగేళ్లు కూడా కలిసిఉండకుండానే విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విడాకుల విషయంలో తప్పు ఎవరిది అనేది ఎవరికి తెలియదు. సామ్ అభిమానులు చై అంటుంటే.. చై అభిమానులు సామ్ దే తప్పు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక విడాకుల ముందు అక్కినేని ఇంటి కోడలిగా ఎంతో గౌరవ మర్యాదలు అందుకున్న సామ్.. విడాకులు అయ్యాక ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ మధ్య సామ్.. మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో ఆమెపై ట్రోల్స్ చేయడం కొద్దిగా తగ్గించారు అభిమానులు.. ఇక తాజాగా చైతూ పెట్టిన పోస్ట్ వలన మరోసారి సామ్ పై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. ఆ పోస్ట్ ఏంటంటే.. ఈ జంట నటించిన మొదటి సినిమా ఏమాయ చేసావే సినిమా రిలీజ్ అయ్యి నిన్నటితో 13 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ విషయాన్నీ తెలుపుతూ చై.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరిలో ఏ మాయ చేసావే పోస్టర్ తో పాటు.. ఆ సినిమా మొత్తంలో ఉన్న సామ్ ఫొటోస్ ను కలిపి పోస్ట్ చేశాడు.
Read Also: Jobs: ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ కావాలని ఉందా?
ఇక దీంతో అభిమానులు చై మనసును తెలుసుకున్నారు. విడాకులు అయిన దగ్గరనుంచి చై, ఏనాడు సామ్ గురించి నెగెటివ్ గా మాట్లాడింది లేదు. ఇప్పుడు కూడా చై మాత్రమే ఈ పోస్ట్ ను పెట్టాడు.. కానీ, తనకు లైఫ్ ఇచ్చిన సినిమా గురించి సమంత ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో సామ్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది మా చైతన్య అంటే.. నీలా కాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా సెట్ లోనే ఈ జంట ప్రేమలో పడడం, పెళ్లి వరకు వెళ్లడం జరిగింది. తమ జీవితంలో ఈ సినిమాను మర్చిపోకూడదని సామ్.. ఈ సినిమా పేరును తన పెళ్లి చీరలో కూడా ప్రింట్ చేయించుకుంది. అలాంటి సినిమాను సామ్ ఎలా మర్చిపోతుంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా.. అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో బెస్ట్ రొమాన్స్ చేయాలంటే సమంత అనే చై ఒప్పుకున్నాడు.. కానీ, కరణ్ షోలో సామ్ మాత్రం మేమిద్దరం పక్కపక్కన ఉంటే నా చేతిలో కత్తి లేకుండా చూసుకుంటాను అని చెప్పడం, తను నా మాజీ భర్త అని చెప్పడం అప్పట్లి సంచలనం సృష్టించింది. దీంతో ఇప్పటికీ చైకు సామ్ అంటే ప్రేమ ఉంది.. కానీ సామ్ మాత్రం ఎప్పుడు అది బయటపెట్టడం పక్కన పెడితే.. నిత్యం చై ను అవమానించేలానే పోస్ట్లు పెడుతూ ఉంటుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ విషయమై సామ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.