Site icon NTV Telugu

Chai Akhil: 50 కోట్ల నష్టాన్ని మిగిలించిన అన్నదమ్ములు…

Chai Akhil

Chai Akhil

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది కానీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. తెలుగు తమిళ భాషల్లో కస్టడీ సినిమా రెండో రోజుకే సైలెంట్ అయిపొయింది. చైతన్య హిట్ ఇస్తాడు అనుకున్న అక్కినేని ఫాన్స్ కి నిరాశ తప్పలేదు. నెల రోజుల్లోనే అక్కినేని ఫాన్స్ కి రెండు గట్టి దెబ్బలు తగిలాయి. ముందుగా ఏప్రిల్ 28న స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’తో ఆడియన్స్ ముందుకి వచ్చాడు అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీతో సమ్మర్‌లో మాస్ జాతర చేయాలని అనుకున్నారు కానీ ఏం లాభం ఏజెంట్ సినిమా ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌ మూవీగా నిలిచిపోయింది. అనిల్ సుంకర నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్.. ఫస్ట్‌ షోకే బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. సెకండ్ డే నుంచి ఏజెంట్ సినిమా ఊహించని డ్రాప్ ఫేస్ చేసింది.

థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారా ఏజెంట్‌కు ఆరు కోట్లకు పైగా షేర్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 36 కోట్ల‌ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా వచ్చిన ఏజెంట్.. మొత్తంగా ముప్పై కోట్ల‌కుపైగా న‌ష్టాల‌ను మిగిల్చిన‌ట్లు ఉంది. దీంతో అత్య‌ధిక న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా ఏజెంట్ నిలిచింది. నాగ చైతన్య కస్టడీ సినిమా ఏజెంట్ రేంజులో బిజినెస్ చెయ్యలేదు కానీ నష్టాలని మాత్రం బాగానే మిగిలించింది. ఓవరాల్ గా కస్టడీ సినిమా లీస్ట్ కేస్ లో ఇరవై కోట్ల నష్టాన్ని తీసుకొచ్చినట్లు ఉంది. ఈ లెక్కన అక్కినేని యంగ్ హీరోలు ఇద్దరూ కలిసి ఫాన్స్ తో పాటు బిజినెస్ వర్గాలకి కూడా ఊహించని షాక్ ఇచ్చారు. దీని నుంచి ఇమ్మిడియట్ గా బయటకి వచ్చి చై, అఖిల్ లు హిట్స్ కొట్టాల్సిందే లేదంటే ఈ హీరోల మార్కెట్ మరింత దెబ్బతినే అవకాశం ఉంది. దాని ఇంపాక్ట్ రాబోయే సినిమాల పైన పడడం గ్యారెంటీ.

Exit mobile version