NTV Telugu Site icon

Chandini Chowdary: అవకాశాల కోసమే లిప్ లాక్..?

Chandini

Chandini

చాందిని చౌదరి.. అచ్చ తెలుగు అందం. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందిని ‘కలర్ ఫొటో’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కోఇనిమ తరువాత స్టార్ హీరోల అవకాశాలు రావడం విశేషం. ఇక తాజాగా చాందిని, కిరణ్ అబ్బవరంతో కలిసి సమ్మతమే అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. గోపీనాధ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ఈ సినిమా ట్రైలర్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కిరణ్, చాందిని ల కెమిస్ట్రీ బావుంది. ఇక ఈ ట్రైలర్ లో చాందిని, కిరణ్ ల లిప్ లాక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి చాందిని ఇలాంటి సీన్స్ చేసింది లేదు. కానీ మొదటిసారి ఈ సినిమాలో కుర్ర హీరోకు తన పెదవిని అందించింది. అయితే ఈ విషయమై పలువురు పెదవి విరుస్తున్నారు.

అవకాశాల కోసమే తెలుగమ్మాయి హద్దుమీరిందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఏది కావాలని కోరుకుంటున్నారో దర్శకులు అలాంటి కంటెంట్ నే డెవలప్ చేస్తున్నారు. ఇక దర్శకుడు చెప్పిన కథ నచ్చితే హీరోయిన్ లు బోల్డ్ క్యారెక్టర్స్ కు కూడా ఓకే చెప్పేస్తున్నారు. చాందిని కూడా కెరీర్ గాడిన పడి స్పీడందుకోవాలంటే బోల్డ్ క్యారెక్టర్స్ కి ఓకే చెప్పాల్సిందే అని అనుకోని లిప్ లాక్ కు ఓకే చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా కథ డిమాండ్ చేయడంతోనే అమ్మడు లిప్ లాక్ కు ఒప్పుకుంది అని మరికొందరు అంటున్నారు. ఈ చిత్రంలో పబ్ కల్చర్ ఉన్న అమ్మాయిగా నటించినప్పుడు ముద్దులు, హగ్గులు సాధారణం అని, అందుకే ఆమె లిప్ లాక్ కు ఓకే చెప్పి ఉంటుందని అంటున్నారు. ఏదిఏమైనా ఈ లిప్ లాక్ తెలుగమ్మాయికి కొత్త అవకాశాలను అందిస్తుందేమో చూడాలి.

Show comments