NTV Telugu Site icon

Chaari 111 First Review: వెన్నెల కిశోర్ చారి 111 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

Chaari 111

Chaari 111

Chaari 111 First Review by Music Director: ఇప్పుడున్న స్టార్ కమెడియన్స్ లో అటు టైమింగ్ తో పాటు ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పలికించడంలో
ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో కామెడీ కింగ్ అని పేరు తెచ్చుకున్న ఆయన హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. మార్చ్ 1 అంటే ఇంకా కొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కె కింగ్ నుంచి ‘చారి 111’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ‘చారి 111’ సినిమా ష్యూర్ షాట్ ఎంటర్‌టైనర్ అని సైమన్ కె కింగ్ రాసుకొచ్చారు. నిజానికి ఏ సినిమాకు అయినా సరే ఫస్ట్ ఆడియన్ సంగీత దర్శకుడే,ఆయన మిక్సింగ్ చేసి ఇచ్చాక ఎడిటర్ సినిమాను ఒక రూపుకు తీసుకొస్తారు.

Sundeep Kishan: మరో రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్న సందీప్ కిషన్

ఇక ఇలా చారి 111 సినిమాను థియేటర్ ప్రింట్ పంపిన తర్వాత సైమన్ కె కింగ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ”సినిమాను లాక్ చేసి, లోడ్ చేశాం, ఈ సినిమా బుల్లెట్ లాగా పేలడానికి రెడీగా ఉంది, ఈ సినిమాకు సంగీతం అందించడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ష్యూర్ షాట్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది, ఇక వెన్నెల కిశోర్ ఫ్యాన్స్ వేయండ్రా… బీజీఎం” అని సైమన్ రాసుకొచ్చారు. దీంతో వెన్నెల కిషోర్ ఫాన్స్ అయితే సినిమా ఎప్పడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ‘చారి 111’ చిత్రానికి టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించగా బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై అదితి సోనీ ప్రొడ్యూస్ చేశారు. ‘చారి 111’ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఫస్ట్ రివ్యూ మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.