NTV Telugu Site icon

HBD Samantha : సామ్ కు సెలెబ్రిటీల విషెస్

Samantha

Samantha

సౌత్ క్వీన్ సమంతకు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ , నార్త్ తో పాటు హాలీవుడ్ పై కూడా కన్నేసింది. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఆమె అభిమానులూ ఇన్నాళ్లు మిస్ అయిన గ్లామర్ ను ఒలకబోస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శాకుంతలం, యశోద, సిటాడెల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాలు చేస్తోంది. ఇటీవలే శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్ గా కూడా ఎంపికైంది. ఇందులో విజయ్ దేవరకొండతో సామ్ రొమాన్స్ చేయనుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే సామ్ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలతో హీట్ పెంచేస్తోంది. కాగా ఈ రోజు సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సెలెబ్రిటీల నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ పుట్టినరోజు సందర్భంగా సామ్ ను ఎవరెవరు స్పెషల్ గా విష్ చేశారో చూద్దాం.