టోక్యో పారాలింపిక్స్‌లో జన్మాష్టమి సందర్భంగా భారతదేశం తన జెండాను ఎగురవేసింది. నేడు అథ్లెట్లు కొన్ని గంటల్లో 4 పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టోక్యో పారాలింపిక్స్‌లో 2 గంటల్లో 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్య పతకం సాధించిన ఇండియా అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. మన దేశం నుంచి అవ్ని లేఖరా ‘షూటింగ్’లో బంగారు పతకం సాధించింది. ‘త్రో డిస్క్’లో యోగేశ్ కథునియా రజత పతకం సాధించారు. ‘జావెలిన్’లో భారతదేశం రజత, కాంస్య పతకాలను గెలుచుకుంది. దేవేంద్ర జజారియా రజతం, సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సినీ సెలెబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా వారిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ హవా… అథ్లెట్లకు సెలెబ్రిటీల సెల్యూట్
