NTV Telugu Site icon

ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థీవ దేహం… సినీ ప్రముఖుల కన్నీటి నివాళి

Sirivennela

Sirivennela

లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల ఇక లేరన్న విషయాన్నీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కిమ్స్ నుంచి నేరుగా ఫిల్మ్ ఛాంబర్ కు సిరివెన్నెల పార్థివదేహం తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివదేహాన్ని ఉంచారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు కడసారిగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు రాజమౌళి కుటుంబ సమేతంగా ఆయన పార్థివదేశాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివ దేహాన్ని చూసి సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం సిరివెన్నెలకి నివాళులు అర్పించారు తనికెళ్ళ. డైరెక్టర్ మారుతి, హీరో వెంకటేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, సింగర్ సునీత, కూడా సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఇంకా పలువురు ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read Also : సిరివెన్నెల మృతిపై ఆర్జీవీ ఎమోషనల్ పోస్ట్

లెజెండరీ గేయ రచయిత పద్మశ్రీ చెంబోలు సీతారామశాస్త్రి (66) ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో నవంబర్ 30న సాయంత్రం 4:07 గంటలకు తుది శ్వాస విడిచారు.