టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నేటి ఉదయం నుంచి ట్విట్టర్ లో వెంకటేష్ నామజపమే నడుస్తోంది. ఇక ఈరోజు స్పెషల్ గా ఆయన నటించిన సినిమాల నుంచి వరుస అప్డేట్స్ విడుదల అవుతుండడం అభిమానులను థ్రిల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి, మహేష్ బాబు, వరుణ్ తేజ్, రానాతో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టినరోజున ప్రత్యేకంగా విష్ చేస్తూ ట్వీట్లు చేశారు. 71వ జన్మదినాన్ని జరుపుకుంటున్న వెంకీ మామపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రేమ, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also : నటి సమంతకు స్వల్ప అస్వస్థత
సినిమాల విషయానికొస్తే… వెంకటేష్ దగ్గుబాటి డబుల్ బ్లాక్‌బస్టర్ “ఎఫ్ 2″కి సీక్వెల్ అయిన స్క్రీన్ స్పేస్ “ఎఫ్ 3” షూటింగ్ జరుగుతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా ఈ చిత్రంలో గ్లామరస్ పాత్రలను పోషించనున్నారు. “ఎఫ్ 3 : ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్” ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది.
