NTV Telugu Site icon

Beast : ఫస్ట్ డే ఫస్ట్ షోలో సెలెబ్రిటీలు… పిక్స్ వైరల్

Beast

Beast

తలపతి విజయ్ నటించిన “బీస్ట్” నేడు ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్‌ హీరోగా, పూజా హెగ్డే కూడా కథానాయికగా నటించింది. సెల్వరాఘవన్, VTV గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో సహాయక పాత్రల్లో కన్పించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక అభిమానులు అన్నాక తమ హీరో మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకుంటారు. అయితే “బీస్ట్” విషయంలో మాత్రం అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా సందడి చేస్తున్నారు.

Read Also : Ravanasura : కీలక షెడ్యూల్ కంప్లీట్ 

ఈరోజు థియేటర్లలోకి వచ్చిన “బీస్ట్”ను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేయడానికి స్టార్స్ క్యూ కట్టారు. “బీస్ట్” టీంతో పాటు పూజా హెగ్డే, అపర్ణా దాస్, అనిరుధ్ రవిచందర్, నెల్సన్ దిలీప్‌కుమార్ వంటి వారితో పాటు కీర్తి సురేష్, ప్రియాంక అరుల్ మోహన్ తదితరులు విజయ్ సినిమాను అర్ధరాత్రి థియేటర్లలో వీక్షించారు. సినీ ప్రముఖులు థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి FDFS నుండే అద్భుతమైన స్పందన వస్తోంది. అభిమానులు యాక్షన్ చిత్రాన్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో థియేటర్‌లకు తరలి వచ్చారు. అంతేకాదు విజయ్ భారీ కటౌట్లు పోస్టర్లు, లైట్లతో థియేటర్లలో సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు.