NTV Telugu Site icon

Tunisha Sharma Suicide Case: టీవీ నటి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. కీలకంగా మారిన సీసీ టీవీ పుటేజ్

Tunisha

Tunisha

Tunisha Sharma Suicide Case: టీవీ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఇండస్ట్రీలో సంచలనం గా మారింది. ప్రియుడు షీజాన్ ఖాన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అలీబాబా దస్తాన్ ఏ కాబుల్ షో షూటింగ్ స్పాట్ లోని తన సహచర నటుడి మేకప్ రూంలో తునీషా శర్మ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రియుడు షీజాన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో షీజాన్ ఖాన్ గంటకో మాట చెప్తున్నాడు. ఒకసారి చెప్పిన మాట ఇంకోసారి చెప్పడం లేదు. దీంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోపక్క తునీషా తల్లి కూడా తన కూతురు ఆత్మహత్య వెనుక షీజాన్ ఖాన్ ఉన్నాడని, అతడే ఆమె మైండ్ ను పాడుచేసి ఆత్మహత్య కు ప్రేరేపించినట్లు తెలిపింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

ఇక ఈ నేపథ్యంలోనే నేడు పోలీసులు తునీషా ను హాస్పిటల్ కు తీసుకెళ్లిన హాస్పిటల్ సీసీటీవీ పుటేజ్ ను చెక్ చేశారు.,ఆ అందులో చావుబతుకుల మధ్య ఉన్న ఆమెను, ప్రియుడు చేతుల మీదుగా తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇంకోపక్క అదే కారులో మరోవ్యక్తి ఆమెకు తీసుకెళ్తూ కనిపించాడు. అయితే కారులో నుంచి హాస్పిటల్ కు తీసుకొచ్చేవరకు ఆమె బతికే ఉన్నట్లు కనిపిస్తోంది. సడెన్ గాహాస్పిటల్ లోపలి వెళ్ళేలోపు ఆమె మృతి చెందింది. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది షీజాన్ ఖాన్ చెప్పడం లేదు. అతనే ఆమెను చంపేశాడా..? అసలు వీరిద్దరి ఆమధ్య గొడవ ఎందుకు వచ్చింది..? అనే వాటి మీద పోలీసులు విచారణ చేపట్టారు.