Site icon NTV Telugu

Catherine Tresa: మరోసారి ఐటమ్ భామగా ఎమ్మెల్యే మేడమ్‌.. ఇప్పుడైనా కలిసొచ్చేనా?

Catherine Tresa Item Song

Catherine Tresa Item Song

అందం ఉంటే సరిపోదు.. కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలి. ఇది హీరోయిన్ ‘కేథరిన్‌ థెరిస్సా’కు సరిగ్గా సరిపోతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ.. ఎందుకో కేథరిన్‌కు రావాల్సినంత క్రేజ్ రాలేదనే చెప్పొచ్చు. స్టార్ హీరోలతో నటించినా.. ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్‌కు పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయారు. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతున్నా.. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేవు అమ్మడి ఖాతాలో. ‘వాల్తేరు వీరయ్య’లో కనిపించినా రెండు మూడు సీన్లకే పరిమితమయ్యారు.

థరిన్‌ థెరిస్సా ప్రస్తుతం అరకొర సినిమాలతో కెరీర్ నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది తమిళ సినిమా గ్యాంగర్స్ మూవీతో సరిపెట్టారు. తెలుగులో మన శంకర్ వరప్రసాద్ గారులో కనిపించబోతున్నారు. అయితే ఇందులో నయనతారది లీడ్‌ రోల్ కావడంతో.. ఇక ఎంత మంది ఉన్నా సపోర్టింగ్‌ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం తెలుగులో ‘ఫణి’ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా గురించి అప్‌డేట్స్‌ లేవు. అయితే తాజాగా క్యాథరిన్ ఓ ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘సిగ్మా’లో పెప్ సాంగ్ చేయబోతున్నారట. ఈ మూవీలో సందీప్ కిషన్‌తో కలిసి స్టెప్పులు వేయనున్నారని టాక్‌.

Also Read: Realme P4x 5G Offers: కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్‌.. రూ.13,499కే సరికొత్త రియల్‌మీ పీ4ఎక్స్ ఫోన్!

ఐటమ్ సాంగ్‌లో నర్తించడం కేథరిన్‌కు కొత్తేమీ కాదు.. గతంలో ;జయ జానకి నాయక;లో స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. ఈ ఏడాది తనే హీరోయిన్‌గా నటించిన ‘గ్యాంగర్స్‌’లో ఓ పాటకు ఊరమాస్ స్టెప్పులేసి అల్లాడించారు. స్పెషల్ సాంగ్స్‌తో మిగిలిన హీరోయిన్స్‌ ఆఫర్లు కొల్లగొడుతుండటంతో.. ఇప్పుడే జ్ఞానోదయమైనట్లుంది ఎమ్మెల్యే మేడమ్‌కు. అందుకే సిగ్మాలో పెప్ సాంగ్‌కు ఒకే చెప్పారట. మరి ఈ స్పెషల్ సాంగ్ అయినా ఈ బొద్దు గుమ్మకు ఆఫర్స్‌ని తెచ్చిపెడతాయో చూడాలి.

Exit mobile version