Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Survival Thriller: సర్వైవల్ థ్రిల్లర్లను ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజీగా చూస్తుంటారు. ప్రకృతి విపత్తులు, ఊహించని ప్రమాదాలు, ప్రాణాల కోసం జరిగే పోరాటం వంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కే ఈ సినిమాలు ప్రేక్షకులను చివరి నిమిషం వరకు సీట్ ఎడ్జ్ లో ఉంచుతాయి. ఇప్పుడు అలాంటి మరో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను అందించేందుకు హాలీవుడ్ చిత్రం ‘ది డెవిల్స్ మౌత్’ సిద్ధమైంది. కేథరిన్ న్యూటన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ త్వరలో ఓటీటీలో నేరుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింబ్స్ గుండెల్లో దఢ పుట్టిస్తున్నాయి.
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ప్రైమ్ వీడియో ‘ది డెవిల్స్ మౌత్’ 2026 జూలై 29 నుంచి స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుందని ఆఫీషియల్ గా కన్ఫార్మ్ చేసింది. థియేటర్లలో ఇది రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీ పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రంలో కేథరిన్ న్యూటన్తో పాటు లానా కాండర్, గావిన్ కాసలెగ్నో, నికో హిరాగా, టామీ రోజ్, టేమ్ థాప్తిమ్థాంగ్ కీలక పాత్రల్లో నటించారు. జెఫ్ వాడ్లో దర్శకత్వం వహించడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. కేథరిన్ న్యూటన్ ఇటీవల ‘రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్’ చిత్రంలో కూడా కనిపించారు. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జానర్లో వస్తున్న ‘ది డెవిల్స్ మౌత్’లో ఆమె మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన ప్రయాణంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హారర్, సర్వైవల్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ ఫ్యాన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా అని మేకర్స్ చెబుతున్నారు.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
‘ది డెవిల్స్ మౌత్’ కథ
ఈ సినిమా కథ ఒక థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్. కొంతమంది కాలేజీ స్నేహితులు తమ జీవితంలోనే మర్చిపోలేని ఒక గొప్ప సాహసం చేయాలనుకుంటారు. అందుకోసం వారు థాయిలాండ్ లోని ఒక అందమైన సముద్రతీర ప్రాంతానికి వెళ్తారు. అక్కడ సముద్రం లోపల , చీకటిగా ఉండే ప్రమాదకరమైన గుహలను అన్వేషించాలని నిర్ణయించుకుంటారు. అయితే వారు ఆ గుహల లోపలికి వెళ్లిన తర్వాత ఊహించని ప్రమాదంలో పడతారు. బయటకు వచ్చే మార్గాలన్నీ మూసుకుపోవడంతో వారంతా ఆ నీటి గుహల్లోనే చిక్కుకుపోతారు.ఆ చీకటి గుహల్లో వారికి మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. అక్కడ వారి ప్రాణాలను తీయడానికి ఒక క్రూరమైన సముద్ర రాక్షస జీవి మాటు వేస్తూ ఉంటుంది. ఆకలితో ఉన్న ఆ రాక్షస జీవి నుండి తమను తాము కాపాడుకుంటూ, ఊపిరి ఆడటానికి కూడా కష్టంగా ఉన్న ఆ సముద్ర గర్భం నుండి ఆ స్నేహితులు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు అనేదే ఈ సినిమా కథ.
తాజావార్తలు
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!