NTV Telugu Site icon

Deepak Malakar: కాస్టింగ్ డైరెక్టర్ అరాచకం.. అందుకు అంగీకరించలేదని తలపగలకొట్టి!

Deepak Malaakar Cating Director

Deepak Malaakar Cating Director

Casting Director Deepak Malakar Breaks Skull Of 18-Year-Old Livein partner: ముంబైలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో రిలేషన్ లో ఉన్న 18 ఏళ్ల యువతి సెక్స్‌కు నిరాకరించిందనే కారణంతో ఆమెను చిత్రహింసలకు గురిచేసి చంపిన కాస్టింగ్ డైరెక్టర్ దీపక్ మలాకర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 26 ఏళ్ల దీపక్ మలాకర్ చిత్రహింసల కారణంగా 18 ఏళ్ల యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యువతి పుర్రె పలుచోట్ల పగిలిందని అంటున్నారు. నిందితుడు దీపక్ మలాకర్ బీహార్ కు చెందిన వ్యక్తి అని ఈ ఘాతుకానికి పాల్పడి ఆగష్టు 11, 2023 న ముంబై నుండి పరారయ్యాడు. ముంబై నుంచి పారిపోయిన అతడు గుజరాత్‌లోని సూరత్‌లో తలదాచుకున్నాడు. అతన్ని ట్రేస్ చేసిన ముంబై పోలీసులు సూరత్ చేరుకుని, సోమవారం అంటే 14 ఆగస్టు 2023న దీపక్ మలాకర్‌ను అరెస్టు చేశారు. ఇక అతన్ని తమ స్టైల్ లో విచారణ చేసి పూర్తి వివరాలు రాబట్టారు పోలీసులు. బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల యువతి గత ఏడాది సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్ ద్వారా మలాకర్‌తో స్నేహం చేయగా అది ప్రేమకు దారి తీసింది.

Neha Shetty: స్టేజిపై చీరతో విశ్వక్ ను చుట్టేసి రొమాన్స్ చేసిన నేహా..

పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండు నెలల క్రితం బాలిక తల్లిదండ్రులను మలాకర్‌ కలిశాడు. అయితే అతను నచ్చడంతో యువతి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ క్రమంలోనే పెళ్లి కాకుండానే ఆ యువతితో కలిసి ఒక 1 BHKలో లివిన్ లో ఉండడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో యువతి తో శారీరక సంబంధం పెట్టుకునేందుకు మలాకర్‌ప్రయత్నాలు ప్రారంభించాడు . అయితే అందుకు యువతి ఒప్పుకోలేదని, ముందు చదువు పూర్తి చేయాలని, ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తరువాతే తన మీద చేయి వేయాలని చెప్పడంతో ఆమె మీద మలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడని అంటున్నారు. అయిదు దీపక్ మలాకర్ 11 ఆగస్టు 2023న వెర్సోవాలోని తన స్నేహితుడి ఫ్లాట్‌కు ఆమెను తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ఎదురుతిరిగింది. దీంతో కోపంలో దీపక్ మలాకర్ ఆమె తలను గోడకు బలంగా కొట్టాడు, ఆమె కింద పడే వరకు ఆమె ముఖంపై కొడుతూనే ఉన్నాడు.

ఆమె కింద పడిపోవడంతో ఆమె చనిపోయిందని భావించి భయాందోళనకు గురై ఫ్లాట్‌ బయటికి వచ్చి నగరం నుంచి పారిపోయాడు. అయితే స్పృహ కోల్పోయిన ఆమె స్పృహలోకి రాగానే సహాయం కోసం కేకలు వేసింది. ఆ తర్వాత ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమె సహాయం చేసి ఆస్పత్రికి తరలించారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా, రెండు రోజుల పాటు ఐసీయూలో ఉంచారు, ఆ తరువాత ఆమె కన్నుమూసింది. ఇక పోలీసులు అతన్ని ట్రేస్ చేసి విచారించగా తన కోరికను తీర్చలేదని ఆమెను హత్య చేయాలనుకున్నట్లు మలాకర్‌ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సూరత్‌కు పారిపోయిన తర్వాత మలాకర్ మొబైల్ స్విచ్ఛాఫ్ చేశాడని, అయితే అక్కడి ఒక లోకల్ నంబర్ ద్వారా తన స్నేహితుడితో టచ్‌లో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. సూరత్‌లోని ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడంతో అతడి లొకేషన్‌పై పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు సూరత్‌కు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మలాకర్‌పై ఐపీసీ సెక్షన్లు 307, 342, 354, 354డి కింద కేసు నమోదు చేశారు.

Show comments