Aarti Mittal: సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ విహరించాలని ఎంతోమంది అమ్మాయిలు కలలు కంటారు. ఆ కలలను నెరవేర్చుకోవడానికి కష్టపడి ఇండస్ట్రీకి వస్తారు. ఆ సమయంలో చేతిలో డబ్బులేక, ఉండడానికి ఇల్లు లేక.. సినిమా మీద ఆశ చావక.. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లే దారి లేక.. అడ్డదారులు తొక్కుతున్నారు. అలా ఎంతోమంది అమ్మాయిలు.. వ్యభిచారులుగా మారిన కథలు ఎన్నో చూశాం. ఇలాంటివారి డీన్ స్థితిని చూసి, అవకాశాలు ఇప్పిస్తామని, డబ్బులు ఇప్పిస్తామని రొంపిలోకి దింపుతున్నారు కొంతమంది. అందులో ఒకరే నటి ఆర్తీ మిట్టల్. క్యాస్టింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పనిచేస్తూ.. పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసిన ఆమె.. డబ్బు కోసం దిగజారి ప్రవర్తించింది.
Tammareddy Bharadwaja: అంత స్టార్ డమ్ ఉన్నవాడు.. ఇప్పుడు రోడ్లపై అలా తిరుగుతూ
తనలాగే హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను, మోడల్స్ ను వ్యభిచారంలోకి దింపింది. వారికి డబ్బు ఇస్తానని, అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి.. వారిచేత వ్యభిచారం చేయిస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు.. ఆమెపై నిఘా పెట్టి.. ఒక ఇద్దరు అమ్మాయిలను మోడల్స్ గా పంపించి సీక్రెట్ ఆపరేషన్ చేయగా.. ఆ ఇద్దరి అమ్మాయిలను వ్యభిచారం చేయాలనీ ఆమె బలవంతం చేసింది. ఆ తరువాత వారిద్దరిని క్లయింట్స్ దగ్గరకు పంపడానికి ప్రయత్నించింది. ఇక అదే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమె వలలో చిక్కిన మరో ఇద్దరు మోడల్స్ ను పోలీసులు కాపాడారు. ప్రస్తుతం ఆమెపై కేసు బుక్ చేశామని, ఆమె వెనుక ఉన్న పెద్ద మనుషులు ఎవరో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.